నేడు జిల్లా స్థాయి విద్య వైజ్ఞానిక ప్రదర్శన
ఒంగోలు సిటీ: విద్యార్థుల్లో సృజనాత్మకత, ఉత్సుకత, ఆవిష్కరణ నైపుణ్యాలను పెంపొందించడంలో భాగంగా పెళ్లూరు సాయిబాబా సెంట్రల్ స్కూల్‌లో 19వ తేదీ జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు డీఈఓ సీవీ రేణుక గురువారం తెలిపారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో మండల స్థాయిలో గెలుపొందిన విజేతలు పాల్గొంటారని తెలిపారు. ఇందులో సస్టైనబుల్ అగ్రికల్చర్, వేస్ట్ మేనేజ్‌మెంట్ అండ్ ఆల్టర్‌నేటీవ్ ప్లాస్టిక్, గ్రీన్ ఎనర్జీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్, రిక్రీయేషనల్ మేథమెటికల్ మోడలింగ్, హెల్త్ అండ్ హైజీన్, వాటర్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్‌మెంట్ అనే థీమ్ ఉంటాయని తెలిపారు. జిల్లాస్థాయి పోటీల్లో మొత్తం 266 విద్యార్థుల ప్రదర్శనలు, 38 ఉపాధ్యాయుల ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. మొత్తం విద్యార్థులు, ఉపాధ్యాయులు 570 మంది ప్రదర్శనలో పాల్గొంటారని పేర్కొన్నారు. పిల్లల్లో ఆవిష్కరణల పట్ల ఆసక్తిని కలిగించేలా సైన్స్ ప్రదర్శన నిర్వహించాలన్నారు.
కనిగిరిరూరల్: ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పట్టణంలోని శివనగర్ కాలనీలో గురువారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. శివనగర్‌కు చెందిన సీహెచ్ బాబు(25) ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు యువకున్ని పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో మృత దేహాన్ని కనిగిరి మండంలోని స్వగ్రామానికి తరలించారు.
టంగుటూరు: మండల పరిధిలోని 16వ నంబర్ జాతీయ రహదారి సమీపంలో గురువారం రాత్రి పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి. వివరాల్లోకి వెళితే..స్థానిక రొయ్యల పరిశ్రమల్లో పనిచేసేందుకు వచ్చిన ఒరిస్సా వాసులకు మధ్యవర్తులు పూరిగుడిసెలు ఏర్పాటు చేశారు. వారంతా ఈ గుడిసెల్లో ఉంటూ షిఫ్టుల వారీగా విధులకు హాజరవుతుంటారు. ఈ క్రమంలో గురువారం నైట్ షిఫ్ట్‌కి వెళ్లిన వారి గుడిసెలకు మంటలంటుకున్నాయి. ఆ సమయంలో అటుగా వెళుతున్న వారు మంటలను అదుపు చేశారు.


