క్రీడలతో మానసిక స్థైర్యం
సంతనూతలపాడు: క్రీడల్లో పాల్గొనడం ద్వారా మానసిక స్థైర్యం పెంపొందుతుందని ఆర్జీయూకేటీ కళాశాలల రిజిష్ట్రార్ ఎస్ అమరేంద్రకుమార్ అన్నారు. మండలంలోని ఎండ్లూరు డొంక వద్ద ఉన్న ఆర్జీయూకేటీ కళాశాల ప్రాంగణంలో ఈ నెల 15న ప్రారంభమైన రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్, క్రికెట్ టోర్నమెంట్ పోటీలు గురువారంతో ముగిశాయి. పోటీల్లో ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం, ఆర్కేపల్లి విద్యార్థులు పాల్గొన్నారు. పోటీలు పోటాపోటీగా సాగాయి. ఫుట్‌బాల్‌లో ఒంగోలు ఆర్జీయూకేటీ కళాశాల విద్యార్థులు విజేతగా నిలవగా, రన్నర్స్‌గా ఆర్కేపల్లి కళాశాల విద్యార్థులు నిలిచారు. క్రికెట్ టోర్నమెంట్లో నూజివీడు విద్యార్థులు విన్నర్స్‌గా నిలవగా, ఒంగోలు ఆర్జీయూకేటీ కళాశాల విద్యార్థులు రన్నర్స్‌గా నిలిచారు. విజేతలకు ఆర్జీయూకేటీ కళాశాలల రిజిష్ట్రార్ ఎస్.అమరేంద్రకుమార్ బహుమతులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్జీయూకేటీ కళాశాలల ఏఓ చంద్రశేఖర్, డీన్ రూపస్‌కుమార్, ఎఫ్‌ఓ మీరావళి, డీన్. దిలీప్, సీఈఓ ఎం శ్రీనివాసరెడ్డి, పీడీ పీవీ భాస్కర్, అధ్యాపకులు పాల్గొన్నారు.
క్రీడలతో మానసిక స్థైర్యం


