జాతీయస్థాయి హాకీ పోటీలకు మద్దిపాడు విద్యార్థిని
మద్దిపాడు: మద్దిపాడులోని కడియాల యానాదయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని కే సిరివల్లి జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపికై ంది. నవంబర్ 23, 24, 25 తేదీల్లో అన్నమయ్య జిల్లా చంద్రగిరిలో జరిగిన అండర్–14 రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో ప్రకాశం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించి ప్రతిభ కనబరచడంతో ఆమెను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు పాఠశాల పీడీ కే వనజ తెలిపారు. త్వరలో మధ్యప్రదేశ్లో జరగబోయే జాతీయస్థాయి హాకీ పోటీల్లో సిరివల్లి పాల్గొంటుందని పీడీ తెలిపారు. ఆమెను జిల్లా విద్యాశాఖ అధికారి ఏ కిరణ్ కుమార్, ఏపీసీ డి.అనిల్‌కుమార్ అభినందించారు. పాఠశాల హెచ్‌ఎం హర్షం వ్యక్తం చేసి పీడీలు వనజ, సౌజన్యను అభినందించారు. జిల్లా హాకీ అసోసియేషన్ సెక్రటరీ టి.శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు పాల్గొన్నారు.


