నిరంకుశ పాలనకు మూల్యం తప్పదు
ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ దారుణం చంద్రబాబు ప్రభుత్వ పాలనపై మాజీ ఎమ్మెల్యే అన్నా ధ్వజం
కొనకనమిట్ల: ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా నిరంకుశ పాలన చేస్తే, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమాన్ని వదిలేస్తే సీఎం చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మార్కాపురం నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మండిపడ్డారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ, పీపీపీ విధానంలో నిర్మించేందుకు చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా శనివారం సాయంత్రం మండలంలోని గనివానిపాడు, వాగుమడుగు, తువ్వపాడు గ్రామాల్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టి ఒకటిన్నర సంవత్సరంలోపే ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. బాబు పాలనలో ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి పెరిగిపోయి దోచుకో..దాచుకో అనే విధానంతో ముందుకెళ్తోందని అన్నా ధ్వజమెత్తారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టేందుకే ప్రైవేటీకరణ చేస్తున్నారని, కోటి సంతకాల ద్వారా ప్రభుత్వ కళ్లు తెరిపించి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలను సేకరించి గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలనే వైఎస్ జగన్ లక్ష్యానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నా విజ్ఞప్తి చేశారు.
‘అన్నా’కు ఘనస్వాగతం
గనివానిపాడులో సర్పంచ్ పాలూరి లక్ష్మీసాంబ వెంకటేశ్వర్లు, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఆకుమళ్ల బంకుకాశయ్య, పాలూరి వెంకటసుబ్బయ్య, కాశయ్య, మాజీ సర్పంచ్ వెంకటనారాయణ, పట్నం వెంగయ్య, వాగుమడుగులో సర్పంచ్ బూదాల కమలాకర్, ఎంపీటీసీ చెన్నెబోయిన కృష్ణవేణి కోటయ్య, బొరిగొర్ల బాలయ్య, చిందె నాగేశ్వరరావు, తువ్వపాడులో మండలపార్టీ కన్వీనర్ మోరా శంకర్‌రెడ్డి, సర్పంచ్ చెరుకూరి శిలువకుమారి, గ్రామ నాయకులు మందలపు శ్రీనివాసులరెడ్డి, జమ్మలమూడి ఇజ్రాయిల్ తదితరుల ఆధ్వర్యంలో అన్నాతో పాటు మండల నాయకులకు ఘన స్వాగతం పలికారు. కోటి సంతకాల సేకరణలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, వైస్ ఎంపీపీ మెట్టు వెంకటరెడ్డి, ఎంపీపీ మోరబోయిన మురళీకృష్ణయాదవ్, జెడ్పీటీసీ అక్కిదాసరి ఏడుకొండలు, వైస్ ఎంపీపీ గొంగటి జెనీఫా, కరుణయ్య, మండల పార్టీ అధ్యక్షుడు మోరా శంకర్‌రెడ్డి, విద్యార్థి విభాగం నియోజకవర్గ కన్వీనర్ ఏలూరి సంజీవరెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ కామసాని వెంకటేశ్వరెడ్డి, పార్టీ అనుబంధ విభాగాల సభ్యులు పాతకోట వెంకటరెడ్డి, కారుమూరి వెంకటేశ్వరెడ్డి, చౌటపల్లి వెంగయ్య, పసుపులేటి ప్రతాప్, మంచికల కోటేశ్వరరావు, చిరుగూరి కోటేశ్వరరావు, తాతిరెడ్డి పెదవెంకటరెడ్డి, బైరెడ్డి కొండారెడ్డి, ఏదుబాటి వెంకటరావు, తంగిరాల బ్రహ్మారెడ్డి, కోండ్రు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
నిరంకుశ పాలనకు మూల్యం తప్పదు


