 
															కోలుకోలేనంత 
													 
										
					
					
					
																							
										
					
					కష్టమోంథా..  కోలుకోలేనంత  è నల్లకాలువ ప్రభావంతో కొత్తపట్నం మండలంలోని అల్లూరు పరిసరాలలో రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని ఈతముక్కల గ్రామంలో బకింగ్ హోం కెనాల్ సమీపంలోని వరద నీరు రోడ్ల మీదకు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.  
 è గుండ్లకమ్మకు వరద ఉధృతి పెరిగి పోవడంతో అధికారులు ఒక్కసారిగా 15 గేట్ల నుంచి నీటిని దిగువకు వదిలారు. దీంతో కరవది ఎస్సీ కాలనీ, యానాది కాలనీలు, మహిళా మండలి సెంటర్లోకి వరద నీరు చేరింది. ఉలిచి గ్రామంలోకి గుండ్లకమ్మ నీరు చేరడంతో కాలనీవాసులు  భయాందోళనకు గురయ్యారు. కర వది నుంచి ఒంగోలుకు రాకపోకలు బందయ్యాయి.  
 è నాగులప్పలపాడు మండలంలోని గుండ్లకమ్మ పరివాహక ప్రాంతంలోని చదవలవాడ వద్ద చీరాల వెళ్లే జాతీయ రహదారి మీదకు భారీగా వరద నీరు చేరడంతో మూడో రోజు గురువారం కూడా ఒంగోలు నుంచి చీరాల వైపు రాకపోకలు ఆగిపోయాయి. ఈ దారిలో ఆర్టీసీ బస్సులను, ఇతర ప్రైవేట్ వాహనాలను పూర్తిగా నిలిపివేశారు.  
 è చీమకుర్తి రూరల్ మండలంలో ఎటు చూసినా వరద నీరు కనిపిస్తోంది. 
 è సంతనూతలపాడు మండలంలోని మద్దలూరు చిలకలపాడు గ్రామాల వైపు వెళ్లే ఆర్ అండ్ బి రహదారులు 80 శాతానికి పైగా కొట్టుకు పోయాయి. దాంతో ఈ దారిగుండా పయనించే ఆర్టీసీ బస్సులను, ఆటోలను నిలిపివేశారు. 
 è టంగుటూరు మండలంలో కారుమంచి, మల్లవరప్పాడు మధ్య ఇప్పటికీ వరద నీరు భారీగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచాయి. 
 è జరగుమల్లి మండలంలో ముసి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పాలేటిపాడు, తూమాడు గ్రామాల మద్య సంబంధాలు తెగిపోయాయి. వావిలేటిపాడు సమీపంలో అడ్డవాగు, గ్రామం పక్కనేవున్న చెరువు ఒకేసారి పారడంతో జరుగుమల్లి వైపు రాకపోకలు నిలిపివేశారు.  
 è కొండపి మండలంలోని కొండపి, అనకర్లపూడి గ్రామాల మద్య అట్లేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. అనకర్లపూడి, మద్దులూరు గ్రామాల మద్య ముసి ఉధృతితో కే.ఉప్పలపాడు, నిడమానూరు మధ్య రాకపోకలు స్తంభించాయి. కొండపి నుంచి ఒంగోలుకు రాకపోకలు ఆగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  
 è దర్శి నియోజకవర్గంలోని ముండ్లమూరు మండలం వేముల నుంచి ఉల్లగల్లు వెళ్లే దారిలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ రెండు గ్రామాల మద్య రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. కురిచేడు మండలంలోని వినుకొండరోడ్డు నుంచి పడమర వీరాయపాలెం వెళ్లే దారిలో కుండపోత వర్షాలకు రహదారి కోతకు గురైంది.  
 è మార్కాపురం మండలం నాగులవరం గ్రామం వద్ద రోడ్డుపై ఇప్పటికీ గుండ్లకమ్మ ప్రవాహం తగ్గలేదు. మార్కాపురం వెళ్లే దారిలేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అత్యవసర పరిస్థితిలో వున్న వారు ప్రత్యామ్నాయంగా నికరంపల్లి గ్రామం వెళ్లి అటునుంచి దేవరాజుగట్టు మీదుగా  చుట్టూ 12 కిలోమీటర్లు ప్రయాణించి మార్కాపురం చేరుకుంటున్నారు.   
తుఫాన్ బీభత్సం అనంతరం నేటికీ జలదిగ్బంధంలోనే గ్రామాలు
కష్టమోంథా.. 
ఒంగోలు టౌట్/ఒంగోలు సిటీ:  మోంథా తుఫాన్ సృష్టించిన విలయం నుంచి జిల్లా ప్రజలు ఇంకా కోలుకోలేదు. తుఫాన్ ప్రభావాన్ని అంచానా వేయడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. జిల్లాలోని 790కి పైగా చెరువుల్లో 90 శాతానికి పైగా పొంగి పొర్లడంతో ఎక్కడిక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా కేంద్రమైన ఒంగోలులోని సగం కాలనీలు నీటమునిగి ప్రజలు నానా ఇబ్బందులుపడ్డారు. నగర శివారు కాలనీల్లో భారీగా వర్షపు నీరు చేరింది. దాంతో ఇంటి నుంచి బయటకు వచ్చే దారిలేక, కనీస అవసరాల కోసం ఇక్కట్లు పడ్డారు. పోతురాజు కాలువ ఉప్పొంగి శివారు కాలనీలను ముంచేత్తింది. నగరంలోని 15 డివిజన్లు, 53 కాలనీలు మునిగిపోయాయి. బిలాల్ నగర్, వెంకటేశ్వరకాలనీ, నేతాజీ నగర్, జయప్రకాష్ కాలనీ, బలరాం కాలనీ, మిలటరీ కాలనీ, కరుణా కాలనీ, చంద్రయ్య నగర్, కార్మిక కాలనీ , నెహ్రూ నగర్ ప్రజలు వరద నీటితో బిక్కుబిక్కుమంటూ ఇళ్లకే పరిమితమయ్యారు. పోతురాజు కాలువ ప్రవహం పెరిగితే తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళనకు గురయ్యారు. నవోదయ స్కూల్లోకి కూడా నీరు చేరింది.  
 ముందస్తు హెచ్చరికలు లేకుండా గుండ్లకమ్మ గేట్లు ఎత్తివేయడంతో కరవది ఎస్సీ కాలనీ, యానాది కాలనీలోకి భారీగా చేరిన వరద నీరు 
 పోతురాజు కాలువ పొంగి ఒంగోలు శివారు కాలనీల్లో నడుముల్లోతు నీరు 
 నల్లకాలువ పొంగడంతో కొత్తపట్నం మండలానికి నిలిచిన రాకపోకలు  
 పశ్చిమ ప్రకాశంలోని రాచర్ల, అర్ధవీడు, బేస్తవారిపేట మండలాల్లోనూ అదే పరిస్థితి 
 తుఫాను నష్టాన్ని అంచనా వేయడంలో అధికారుల ఘోర వైఫల్యం 
 వదర బాధితులకు అందని ప్రభుత్వ సాయం