ఇరిగేషన్‌.. కళ్లు మూసెన్‌! | - | Sakshi
Sakshi News home page

ఇరిగేషన్‌.. కళ్లు మూసెన్‌!

Oct 31 2025 7:23 AM | Updated on Oct 31 2025 7:23 AM

ఇరిగే

ఇరిగేషన్‌.. కళ్లు మూసెన్‌!

ఇరిగేషన్‌.. కళ్లు మూసెన్‌!

కంభం/బేస్తవారిపేట: ఇరిగేషన్‌ శాఖాధికారుల నిర్లక్ష్యంతో కంభం చెరువు అలుగు వాగు తెగడంతో నక్కలగండి తూముకింద ఉన్న పంట పొలాలు నీటమునిగాయి. కంభం చెరువు అలుగు పారుతూ భారీగా వరద దిగువకు వస్తున్న క్రమంలో గండి పడటంతో తెగిపోయి అరటి, పసుపు, మిర్చి, కరివేపాకు, కంది పంటలు సుమారు 100 ఎకరాలకు పైగా దెబ్బతిన్నాయి. పెద్ద అలుగు వాగులో భారీగా పెరిగిన కంప చెట్లు తొలగించకపోవడమే దీనికి కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. డ్రిప్‌ పైపులు కొట్టుకుపోవడంతోపాటు అరటి తోట నీటమునిగిందని రైతు నాగరాజు, అలుగు వాగు ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకోకుండా పంటలు దెబ్బతినేందుకు ఇరిగేషన్‌ అధికారులు కారణమయ్యారని రైతు సుబ్రహ్మణ్యం, ఎకరా పసుపు, 3 ఎకరాల్లో అరటి మునిగిపోయిందని రైతు శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు.

బేస్తవారిపేట మండలంలోని సోమవారిపేట సమీపంలో చీతిరాల కతువ ఉప్పొంగింది. బుధవారం నుంచి కంభం చెరువు అలుగు పారుతున్నప్పటికీ కతువ గేట్లు సకాలంలో ఎత్తలేదు. గురువారం ఉదయానికి కతువ నిండి చుట్టు పక్కల పొలాలను వరద నీరు ముంచెత్తింది. పొట్టదశలో ఉన్న వరి పంట, కోత దశలోని అరటి, పసుపు, చెరుకు పంటలు నీటిలో మునిగిపోయాయి. ఇరిగేషన్‌శాఖ డీఈ వేమయ్య, ఏఈ శ్రీనునాయక్‌, తహసీల్దార్‌ జితేంద్రకుమార్‌ హడావుడిగా వెళ్లి ఏడు గేట్లను ఎత్తించారు. గేట్లకు పూడిక, చెట్లు అడ్డు పడటంతో అవి తెరుచుకోలేదు. జేసీబీని రప్పించి గేట్ల వద్ద అడ్డుపడిన పూడికను తొలగించాల్సి వచ్చింది. కతువ పక్కన పొలంలోని రేకుల షెడ్డులో నిల్వ ఉంచిన 20 ఎరువుల బస్తాలు నీటిలో కరిగిపోయాయి. లక్ష్మీనరసింహా నర్సరీలోకి భారీగా వరద నీరు చేరడంతో రూ.లక్ష నష్టం వాటిల్లిందని నర్సరీ యజమాని మౌలాలి తెలిపారు.

రైతులకు శాపంగా మారిన ఇరిగేషన్‌ అధికారుల నిర్లక్ష్యం

కంభం అలుగు వాగుకు గండి

బేస్తవారిపేట వద్ద తెరుచుకోని చీతిరాల కతువ షట్టర్‌

సుమారు 250 ఎకరాల్లో నీట మునిగిన పంటలు

ఇరిగేషన్‌.. కళ్లు మూసెన్‌! 1
1/3

ఇరిగేషన్‌.. కళ్లు మూసెన్‌!

ఇరిగేషన్‌.. కళ్లు మూసెన్‌! 2
2/3

ఇరిగేషన్‌.. కళ్లు మూసెన్‌!

ఇరిగేషన్‌.. కళ్లు మూసెన్‌! 3
3/3

ఇరిగేషన్‌.. కళ్లు మూసెన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement