14 కిలోల గంజాయి పట్టివేత
ఒంగోలు టౌన్: రైలు మార్గం గుండా అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్పెషల్ టీం పోలీసులు పట్టుకున్నారు. గంజాయి అక్రమ రవాణాపై మహిళా పోలీసు స్టేషన్ సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో పోలీసులు, స్పెషల్ పార్టీ, ఈగల్ టీం సిబ్బంది, జాకీ జాగిలంతో కలిసి సోమవారం ఒంగోలు మీద నుంచి వెళ్లే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎర్నాకుళం జంక్షన్ ఎకై ్సప్రెస్‌లో ఒంగోలు నుంచి కావలి వరకు నిర్వహించిన తనిఖీల్లో 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని బలంగీర్ జిల్లా బిలీసర్దా గ్రామానికి చెందిన ఆనంద్ రాణా, అదే రాష్ట్రానికి చెందిన బౌద్ జిల్లా ఖలియముండా గ్రామానికి చెందిన మిలు మతాలిలను అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం జీఆర్‌పీ పోలీసులకు అప్పగించారు. గంజాయి, మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1972, డయల్ 112, పోలీసు వాట్సప్ నంబర్ 9121102266కు సమాచారం ఇవ్వాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్సైలు శివరామయ్య, చెంచయ్య, జీఆర్‌పీ ఎస్సై మధుసూదన్ రావు, ఈగల్, స్పెషల్ పార్టీ టీం సభ్యులు పాల్గొన్నారు.


