శివాయ నమః..
కురిచేడులోని జ్ఙానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామి అభిషేకాన్ని తిలకిస్తున్న భక్తులు, స్వామివారి దర్శనానికి బారులుదీరిన భక్తులు
జిల్లాలోని శైవక్షేత్రాలన్నీ భక్తులతో నిండిపోయాయి. శివనామస్మరణ మార్మోగింది. శివలింగాలకు అభిషేకాలు, ప్రత్యేక పూజలతో ఆలయాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. కార్తీక మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని వేకువజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో శివాలయాలకు చేరుకున్నారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కార్తీక దీపాలు వెలిగించారు. పలు ఆలయాలలో శివపార్వతుల కళ్యాణాలు జరిపించారు. సాంబశివునికి విశేష పూజలు నిర్వహించారు.
– సాక్షి, ఒంగోలు
సంతపేట సాయిబాబా ఆలయంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తున్న వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి
ఒంగోలులోని కొత్తపట్నం బస్టాండ్ వద్ద శివాలయంలో కార్తీక దీపం వెలిగిస్తున్న మహిళ
శివాయ నమః..
శివాయ నమః..
శివాయ నమః..


