
గుర్రం జాషువాకు ఘన నివాళి
ఒంగోలు వన్‌టౌన్: గుర్రం జాషువా 54వ వర్ధంతి కార్యక్రమాన్ని ప్రకాశంభవన్ ప్రాంగణంలోని గుర్రం జాషువా కాంస్య విగ్రహం వద్ద గురువారం ఘనంగా నిర్వహించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డీఆర్‌ఓ చిన్న ఓబులేషు, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరక్టర్ ఎన్ లక్ష్మా నాయక్, నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జాషువా గురించి వివరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ, కత్తి కళ్యాణ్, ఎజ్రాశాస్త్రి, కార్యాలయం పర్యవేక్షకులు డి.మధుసూధన్‌రెడ్డి, ఒంగోలు సహాయ సంక్షేమ అధికారి రబియా బేగం, సంక్షేమ అధికారి డి.అంకబాబు, సీహెచ్ సరితాదేవి, తదితరులు పాల్గొన్నారు.
బొగ్గుల లోడు లారీ బోల్తా
కంభం: బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటన మండలంలోని జంగంగుంట్లలో గురువారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళితే..రాజమండ్రి నుంచి అనంతపురానికి బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ అనంతపురం– అమరావతి జాతీయరహదారిపై జంగంగుంట్ల గ్రామం వద్ద బోల్తా పడింది. ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం లారీలో ఉన్న బొగ్గు బస్తాలను కిందకు దింపి లారీని పైకి లేపారు.
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బైక్
పొదిలి: పెట్రోల్ బంక్ నుంచి హైవేపైకి వస్తున్న ట్రాక్టర్‌ను అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న బైక్ ఢీకొన్న సంఘటన గురువారం స్థానిక దర్శి రోడ్డులోని గ్యాస్ గోడౌన్ వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మండలంలోని మల్లవరం గ్రామానికి చెందిన పిల్లి వెంకటేశ్వర్లు తన బైక్‌పై పొదిలి నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు. అదే సమయంలో పెట్రోల్ బంకులో నుంచి ట్రాక్టర్ రోడ్డుపైకి వస్తుంది. రెండు వాహనాలు పరస్పరం ఢీకొనడంతో వెంకటేశ్వర్లు రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. అధిక మొత్తంలో రక్తస్రావమైంది. క్షతగాత్రుడిని 108 వాహనంలో తొలుత పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు, మెరుగైన వైద్యం కోసం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంధువులు తెలిపారు.

గుర్రం జాషువాకు ఘన నివాళి

గుర్రం జాషువాకు ఘన నివాళి