గంజాయి ముఠా అరెస్టు | - | Sakshi
Sakshi News home page

గంజాయి ముఠా అరెస్టు

Jul 15 2025 6:15 AM | Updated on Jul 15 2025 6:15 AM

గంజాయి ముఠా అరెస్టు

గంజాయి ముఠా అరెస్టు

3.100 కేజీల గంజాయి, రూ.9.06 లక్షల సొత్తు స్వాధీనం

సింగరాయకొండ: గంజాయి అక్రమంగా రవాణా చేస్తూ అమ్మకాలు సాగిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 3.100 కేజీల గంజాయి, రూ.9.06 లక్షల విలువైన వెండి, బంగారు వస్తువులు, వెండి కరిగించే మిషన్‌, కట్టర్‌ స్వాధీనం చేసుకున్నట్లు సింగరాయకొండ సీఐ హజరత్తయ్య వెల్లడించారు. మండల కేంద్రంలోని సర్కిల్‌ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. సీఐ హజరత్తయ్య మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం హజంఘడ్‌ జిల్లా టేక్కా మండలం మెయిన్పూర్‌ గ్రామానికి చెందిన ముకేష్‌కుమార్‌ మద్దిపాడులో నివసిస్తున్నాడు. ఇతనితో పాటు 65 కేసుల్లో ముద్దాయిగా ఉన్న గుంటూరు జిల్లా అంకిరెడ్డి పాలెం గ్రామానికి చెందిన ఒడ్లమాను శివారెడ్డి, ఒంగోలు లోని 10వ డివిజన్‌ ఎఫ్‌సీఐ గోడౌన్‌ వద్ద ఉన్న ఇందిరమ్మ కాలనీ దగ్గర గుర్రం జాషువా నగర్‌ లో నివసిస్తున్న ట్రంకు కార్తీక్‌ లు జరుగుమల్లి మండలం వావిలేటిపాడు అడ్డరోడ్డు వద్ద అనుమానాస్పదంగా ఉండగా వారిని విచారించామన్నారు. ముకేష్‌కుమార్‌ మద్దిపాడు జాతీయ రహదారి పై లారీల దగ్గర తక్కువ రేటుకు డీజిల్‌కొని అమ్మేవాడు. ఆ ఆదాయం చాలకపోవటంతో గంజాయి అమ్మి అధిక లాభాలు పొందాలనే అత్యాశతో లారీ యజమానుల దగ్గర ఒడిశా సరిహద్దుల్లో గంజాయి లభించే మార్గాలను తెలుసుకుని అక్కడికి వెళ్లి కేజీ రూ.10 వేలు చొప్పున తీసుకొచ్చి చిన్న ప్యాకెట్లు చేసి అమ్మేవాడు. ఇతని వద్ద నుంచి కేజీ రూ.12 వేలకు శివారెడ్డి, కార్తీక్‌లు కొనుగోలు చేసి వారు కూడా చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అమ్మేవారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ముకేష్‌కుమార్‌ ఒడిశా నుంచి తెప్పించిన 3.100 కేజీల గంజాయిని వీరిద్దరికి ఇచ్చే క్రమంలో పట్టుకుని వారి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. తరువాత వారిని తనిఖీ చేయగా వారి వద్ద నుంచి మోటారుసైకిల్‌, వెండి కరిగించే మిషన్‌, సెల్‌ఫోన్‌లు, 8 కేజీల బరువున్న 57 వెండి కడ్డీలు, 9 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని ఆయన వివరించారు. వీరిలో శివారెడ్డి పై ఒంగోలు తాలూకా, హెచ్‌ఎంపాడు, పొన్నలూరు, జరుగుమల్లి, కొండపి, వెలిగండ్ల మండలాల్లో సుమారు 65 కేసులు ఉన్నాయన్నారు. వీరి పై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచనున్నట్లు సీఐ వివరించారు. ఈ సందర్భంగా సీఐ హజరత్తయ్య, జరుగుమల్లి ఎస్సై బీ మహేంద్ర, సిబ్బంది అమీర్జాన్‌, నరశింహ, శివకుమార్‌, నాగూర్‌వలీ, సీసీఎస్‌ సిబ్బందిని ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement