అడుగడుగునా ఆంక్షలు.. | - | Sakshi
Sakshi News home page

అడుగడుగునా ఆంక్షలు..

Jul 12 2025 7:05 AM | Updated on Jul 12 2025 11:05 AM

అడుగడ

అడుగడుగునా ఆంక్షలు..

కొండపి: కొండపిలో శుక్రవారం నిర్వహించిన వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని అడ్డుకోవడానికి మంత్రి ఆదేశాలతో పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. గురువారం రాత్రి నుంచి ఆటంకాలు సృష్టిస్తూ అడ్డుకోవడానికి ప్రయత్నించారు. భారీగా సమావేశం నిర్వహించడాన్ని జీర్ణించుకోలేని మంత్రి స్వామి ఎలాగైనా తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని సమావేశం జరగకుండా చేయాలని కుట్రలు పన్నారు. దీనికి పోలీసులతో అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. ఫ్లెక్సీలు కడుతున్న వారిని అడ్డుకొని వారి మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎవరు చెబితే ఫ్లెక్సీలు కట్టారు, ఫ్లెక్సీలు కడితే మీ మీద కేసులు నమోదు చేస్తామని బెదిరించారు. సమాచారం తెలుసుకున్న మాజీ మంత్రి సురేష్‌ వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి పోలీసులతో మాట్లాడారు. ఎటువంటి ప్రభుత్వాన్ని కించపరిచే ఫ్లెక్సీలు లేనప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. శుక్రవారం ఉదయం నుంచి కొండపికి నలుమూలల ఎనిమిది చోట్ల చెక్‌పోస్ట్‌లు పెట్టి తనిఖీలు నిర్వహించారు.

కొండపి నుంచి టంగుటూరు వెళ్లే గురుకుల పాఠశాల సమీపంలో ఒకటి, కే.ఉప్పలపాడు వద్ద, కామేపల్లి వెళ్లే రోడ్డులో హోసన్న చర్చి దగ్గర ఒకటి, పొదిలి వెళ్లే రోడ్డులో ఫైర్‌ స్టేషన్‌ దగ్గర, సంతనూతలపాడు వెళ్లే రోడ్డులో పోలీస్‌ స్టోరేజ్‌ వద్ద, జాళ్లపాలెం వెళ్లే రోడ్డులో జండా చెట్టు సెంటర్‌ వద్ద, కొండపి టౌన్లోని కామేపల్లి సెంటర్లో, ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా వస్తున్న వారందరినీ కూడా ఒకే కారులో రావాలని అడ్డుకున్నారు. ద్విచక్ర వాహనాలపై వచ్చే వారిని హెల్మెట్‌ లేదనే కారణంతో వెనక్కి తిప్పి పంపించారు. ఎన్నడూ లేని విధంగా హెల్మెట్లు, వాహన పత్రాలు తనిఖీ చేయడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆటోలను, కార్లను ఆపి తనిఖీలు చేశారు. మీకు కొండపిలో ఏం పని? ఈ సమయంలో కొండపి కి ఎందుకు వెళ్తున్నారు? విస్తృత స్థాయి సమావేశానికి వెళితే తిరుగు ప్రయాణంలో మీ మీద చర్యలు తీసుకుంటామని వాహనదారులను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. సమావేశానికి రాకుండా కార్యకర్తలను ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. కొంతమంది కార్యకర్తల మొబైల్‌ ఫోన్‌లు తీసుకొని సమావేశానికి రాకుండా ఆటంకపరిచారు. అయినా కార్యకర్తలు ఇవేవీ లెక్కచేయకుండా తమ వాహనాలను కొండపికి రెండు కిలోమీటర్ల దూరంలోనే నిలిపి నడుచుకుంటూ సమావేశ స్థలానికి చేరుకున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వేలాది మంది కార్యకర్తలు సమావేశానికి హాజరయ్యారు.

వైఎస్సార్‌ సీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని

అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నాలు

మంత్రి ఆదేశాలతో నలుమూలల చెక్‌ పోస్టులు, తనిఖీలు

అయినా భారీగా హాజరైన వైఎస్సార్‌ సీపీ శ్రేణులు

అడుగడుగునా ఆంక్షలు.. 1
1/1

అడుగడుగునా ఆంక్షలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement