సర్పంచ్‌ కుటుంబ సభ్యులకు బూచేపల్లి, తాటిపర్తి పరామర్శ | - | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ కుటుంబ సభ్యులకు బూచేపల్లి, తాటిపర్తి పరామర్శ

Jun 30 2025 7:24 AM | Updated on Jun 30 2025 7:24 AM

సర్పంచ్‌ కుటుంబ సభ్యులకు బూచేపల్లి, తాటిపర్తి పరామర్శ

సర్పంచ్‌ కుటుంబ సభ్యులకు బూచేపల్లి, తాటిపర్తి పరామర్శ

పెద్దదోర్నాల: అక్రమ కేసులతో అరెస్టయిన చిన్న గుడిపాడు సర్పంచ్‌ వల్లభనేని మల్లికార్జున (పవన్‌) కుటుంబ సభ్యులను వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్‌ పరామర్శించారు. ఆదివారం మండలంలో పర్యటించిన వారు చిన్నగుడిపాడులోని పవన్‌ స్వగృహంలో అతని బంధువులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. టీడీపీ ప్రభుత్వ అధికారం ఉందన్న గర్వంతో తప్పుడు కేసులు బనాయిస్తోందన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బాధితుల పక్షాన నిరంతరం పోరాడుతోందని తెలిపారు. ప్రజాదరణ కలిగిన వల్లభనేని మల్లికార్జునను ఆర్థికంగా, రాజకీయంగా ఇబ్బందులకు గురి చేయాలనే ఇటువంటి కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. దీంతో పాటు ఇటీవల శరస్త్‌ర చికిత్సలు చేయించుకున్న గాదె బ్రహ్మారెడ్డిని తన నివాస గృహంలో పరామర్శించి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట పార్టీ మండల కన్వీనర్‌ గంటా రమణారెడ్డితో పాటు మండల నాయకులు, స్థానిక నాయకులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement