రూ.1200 తీసుకో.. రూ.200 ఇవ్వు! | - | Sakshi
Sakshi News home page

రూ.1200 తీసుకో.. రూ.200 ఇవ్వు!

Jun 21 2025 2:56 AM | Updated on Jun 21 2025 3:45 AM

రూ.1200 తీసుకో.. రూ.200 ఇవ్వు!

రూ.1200 తీసుకో.. రూ.200 ఇవ్వు!

కొనకనమిట్ల: ‘వారానికి రూ.200 ఇవ్వండి మీకు రూ.1200 పడేలా చేస్తాం..’ ఇదీ ప్రస్తుతం ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి గ్రామాలలో నడుస్తున్న తంతు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో అధికారుల సహకారంతో వారు పెట్టిన మేట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు యథేచ్ఛగా అవకతవకలకు పాల్పడుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక జాబ్‌ కార్డులో నలుగురు ఉంటే వారిలో ఒకరు పనికి వెళ్లి వస్తే చాలు మిగతా వారికి కూడా వారానికి ఒకసారి అకౌంట్‌లో నగుదు జమ చేస్తున్న తీరు చర్చనీయాంశమైంది. కొనకనమిట్ల మండలం మంగాపురం గ్రామంలో చేసిన పనులకు సంబంధించి ఒక్కో కూలీ నుంచి రూ.200 చొప్పున మేట్‌ వసూలు చేసిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒకరికి రూ.1200 కూలి పడితే అందులో నుంచి మేట్‌ రూ.200 వసూలు చేస్తున్నాడు. అది కూడా వారానికి ముందే డబ్బు ఇవ్వాలని డిమాండ్‌ చేయడం గమనార్హం. దీనిపై ఎంపీడీఓ ఈశ్వరమ్మను వివరణ కోరగా.. ఫీల్డ్‌ అసిస్టెంట్‌, మేట్‌కు షోకాజ్‌ నోటీసులు ఇచ్చామని చెప్పారు.

పనికి వెళ్లకపోయినా ఫర్వాలేదు, మీ అకౌంట్‌లో డబ్బు

చేతివాటం ప్రదర్శిస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లు, మేట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement