ఘనంగా బూచేపల్లి కమలాకర్‌రెడ్డి జయంతి | - | Sakshi
Sakshi News home page

ఘనంగా బూచేపల్లి కమలాకర్‌రెడ్డి జయంతి

Jun 18 2025 3:33 AM | Updated on Jun 18 2025 3:33 AM

ఘనంగా బూచేపల్లి కమలాకర్‌రెడ్డి జయంతి

ఘనంగా బూచేపల్లి కమలాకర్‌రెడ్డి జయంతి

చీమకుర్తి: సినీ హీరో, నిర్మాత బూచేపల్లి కమలాకర్‌రెడ్డి 48వ జయంతి సందర్భంగా తల్లి జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, సోదరుడు వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, సతీమణి నందిని ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం చీమకుర్తిలోని బూచేపల్లి కమలాకర్‌రెడ్డి పార్కులో ఆయన స్మారకం వద్ద తొలుత కేక్‌ కట్‌ చేశారు. కమలాకర్‌రెడ్డితో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో బూచేపల్లి కుటుంబ సభ్యులతోపాటు ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ సభ్యుడు వేమా శ్రీనివాసరావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గోపురపు రాజ్యలక్ష్మి, వైఎస్సార్‌ సీపీ పట్టణ అధ్యక్షుడు క్రిష్టిపాటి శేఖరరెడ్డి, మండల రూరల్‌ అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, పలు గ్రామాల పార్టీ నాయకులు పాల్గొన్నారు.

నివాళులర్పించిన బూచేపల్లి వెంకాయమ్మ, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement