ఆస్పత్రి ఉన్నా..అందని వైద్యం | - | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి ఉన్నా..అందని వైద్యం

Jun 18 2025 3:31 AM | Updated on Jun 18 2025 3:31 AM

ఆస్పత

ఆస్పత్రి ఉన్నా..అందని వైద్యం

కొనకనమిట్ల: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది కొనకనమిట్ల మండలం పెదారికట్ల హోమియో వైద్యశాల పరిస్థితి. వైద్యశాలలో ఉన్న డాక్టర్‌ని బదిలీ చేశారు. డాక్టర్‌ లేకపోయినా ఉన్న కాంపౌండర్‌ వైద్యశాలకు వచ్చే వారికి హోమియో మందులు ఇచ్చి పంపేవారు. కానీ ఆయనను కూడా 10 నెలల క్రితం డిప్యుటేషన్‌పై వేరే చోటకు సాగనంపారు. దీంతో అప్పటి నుంచి వైద్యశాల మూతపడింది. ఆస్పత్రిలో మందులు లోపలే మగ్గిపోతున్నాయి. సుమారు 50 ఏళ్ల క్రితం పెదారికట్ల గ్రామంలో గ్రామ పంచాయతీ భవనంలోని ఓ గదిలో ఏర్పాటు చేసిన హోమియో వైద్యశాలలో డాక్టర్‌, కాంపౌండర్‌ అందుబాటులో ఉండి ప్రజలకు వైద్యసేవలు అందిస్తుండటంతో చుట్టుపక్కల నాలుగు గ్రామాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంది. అంతవరకు బాగానే ఉన్నా గతేడాది డాక్టర్‌ను వేరే చోటకు బదిలీ చేశారు. వైద్యశాలలో ఉన్న కాంపౌండరే అక్కడ దిక్కుగా మారాడు. వచ్చిన వారికి మందులు ఇచ్చి పంపేవాడు. కానీ అతన్ని కూడా అధికారులు ఉండనీయలేదు. పై అధికారులు చెప్పారని ఇక్కడి నుంచి మన్నేపల్లిలోని హోమియో వైద్యశాలకు డిప్యుటేషన్‌ పేరుతో అక్కడికి పంపారు. అప్పటి నుంచి హోమియో వైద్యశాల మూతపడింది. నిత్యం పలు వ్యాధులకు హోమియో మందులు వాడే వారు వైద్యశాల మూతపడటంతో ప్రైవేటు వైద్యశాలలకు వెళ్లక తప్పటంలేదని స్థానిక గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా గ్రామంలో హోమియో వైద్యసేవలు పొందిన ప్రజలు వైద్యశాల మూతపడటంతో కొన్ని నెలల క్రితం వైద్యశాల వద్దకు వచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వైద్యశాలను తెరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

హోమియో వైద్యశాలను తెరిపించాలి..

ప్రభుత్వ హోమియో వైద్యశాల ఉండటం వలన ప్రజలకు ఎంతగానో ఉపయోగపడింది. హోమియో మందులు వాడటం వలన జబ్బులు నయం కావడంతో చాలా మంది ఆస్పత్రికి వచ్చేవారు. డాక్టర్‌, కాంపౌండర్‌ను బదిలీ చేయటం అన్యాయం. సంబంధిత అధికారులు స్పందించి హోమియో వైద్యశాలకు డాక్టర్‌, సిబ్బందిని నియమించి ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలి.

– ఎన్‌ బాలచంద్రుడు, పెదారికట్ల

డాక్టర్‌ లేరు..ఉన్న కాంపౌండర్‌ను డిప్యుటేషన్‌కు.. హోమియో వైద్యశాలను తెరిపించాలని వేడుకుంటున్న గ్రామస్తులు

ఆస్పత్రి ఉన్నా..అందని వైద్యం1
1/3

ఆస్పత్రి ఉన్నా..అందని వైద్యం

ఆస్పత్రి ఉన్నా..అందని వైద్యం2
2/3

ఆస్పత్రి ఉన్నా..అందని వైద్యం

ఆస్పత్రి ఉన్నా..అందని వైద్యం3
3/3

ఆస్పత్రి ఉన్నా..అందని వైద్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement