ఏపీటీసీఏ జిల్లా అధ్యక్షుడిగా అజయ్ కుమార్
ఒంగోలు సిటీ: ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ (ఏపీటీసీఏ) నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా ఆర్కిడ్స్ హైస్కూల్ కరస్పాండెంట్ గేరా అజయ్ కుమార్ ఎన్నికై నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ (ఏపీటీసీఏ) రాష్ట్ర నాయకులు, ఎన్నికల పరిశీలకులు మాంటిస్సోరి ప్రకాష్ బాబు మంగళవారం ప్రకటించారు. అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు, ఎన్నికల పరిశీలకుడు మాంటిస్సోరి ప్రకాష్ బాబు మాట్లాడుతూ జిల్లా కార్యవర్గ అధ్యక్షుని ఎన్నికకు ఈనెల రెండో తేదీ నుంచి ఆరో తేదీ వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగిందని ఈ నామినేషన్ ప్రక్రియలో ఆర్కిడ్స్ హైస్కూల్ కరస్పాండెంట్ గేరా అజయ్ కుమార్ ప్రకాశం జిల్లా నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. ఆయనకు రాష్ట్ర ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరఫున ప్రకాష్ బాబు అభినందనలు తెలియజేశారు. త్వరలోనే నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరుగుతుందని ఈయన తెలిపారు. కార్యక్రమానికి ఐపీపీ కృష్ణసాయి హైస్కూల్ కరస్పాండెంట్ పిడుగు జాలిరెడ్డి అధ్యక్షత వహించగా, పూర్వ జిల్లా అధ్యక్షుడు ఆంధ్ర హైస్కూల్ కరస్పాండెంట్ బీ శ్రీనివాసరావు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై న గేరా అజయ్ కుమార్‌కు జిల్లాలోని పాఠశాలల కరస్పాండెంట్లు, డైరెక్టర్లు, ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు.


