‘అమ్మా పురంధేశ్వరి గారూ.. మీ చుట్టం చట్టాన్ని ఉల్లంఘించాడు’ | Sakshi
Sakshi News home page

‘అమ్మా పురంధేశ్వరి గారూ.. మీ చుట్టం చట్టాన్ని ఉల్లంఘించాడు’

Published Thu, Oct 12 2023 2:34 PM

Ysrcp Mp Vijayasai Reddy Tweet On Purandeswari - Sakshi

సాక్షి, ఢిల్లీ: బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వ్యవహార తీరుపై ట్విటర్‌ వేదికగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో చురకలు అంటించారు. ‘‘అమ్మా పురంధేశ్వరి గారూ.. మీ చుట్టం చట్టాన్ని ఉల్లంఘించాడు. నేరం జరిగింది. మీ మరిది చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడు. 13 సార్లు సంతకం కూడా పెట్టాడు. అయినా ఆయనకు చట్టం వర్తింపజేయటానికి వీల్లేదని మీరు ఢిల్లీలో క్యాంపెయిన్‌ చేస్తున్నారు.’’ అంటూ దుయ్యబట్టారు. 

‘‘ఒక ఫేక్‌ ఎగ్రిమెంట్‌తో స్కిల్‌ స్కాం చేశారని కేంద్ర ప్రభుత్వ ఈడీ అరెస్టులు కూడా చేసింది. ఆ ఒప్పందం ఫేక్‌ అని సీమన్స్‌ కంపెనీ కూడా ధ్రువీకరించింది. ఆ ఎగ్రిమెంట్‌తో తమకు సంబంధం లేదని కూడా చెప్పింది! ఆ డబ్బు తమకు అందలేదని 164 స్టేట్‌మెంట్‌లో చెప్పింది.’’ అని పేర్కొన్నారు.

‘‘సాక్షాత్తు మీ మరిది చంద్రబాబు ఆ డబ్బును షెల్‌ కంపెనీల ద్వారా ఎలా రూట్‌ చేశారో స్వయంగా బాబు పీయే వెల్లడించిన విషయం ఐటీ శాఖ నిర్ధారించింది. ఒక చిన్న కేసులో ఏకంగా 119 కోట్ల ముడుపుల్ని నిర్ధారిస్తూ కేంద్ర ప్రభుత్వ ఐటీ శాఖ, మీ మరిది చంద్రబాబుకు సుదీర్ఘమైన ఉత్తర  ప్రత్యుత్తరాల తరవాత షోకాజ్‌ నోటీసులు కూడా ఇచ్చింది’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement