
సాక్షి, కోనసీమ జిల్లా: వైఎస్సార్‌సీపీ నేత చిర్ల జగ్గిరెడ్డిపై మంత్రి వాసంశెట్టి సుభాష్ చేసిన వ్యాఖ్యలను శెట్టిబలిజ నేతలు ఖండించారు. మంత్రి సుభాష్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ నాయకుడు పిల్లి సూర్య ప్రకాష్ మండిపడ్డారు. వైఎస్ జగన్, జగ్గిరెడ్డిలను విమర్శించే స్థాయి సుభాష్‌కు లేదన్నారు.
పనితీరులో మంత్రి సుభాష్ 25వ స్థానంలో ఉన్నారని విషయం మరిచిపోకూడదని సూర్యప్రకాష్ అన్నారు. శెట్టిబలిజ జాతికి సుభాష్ చేసిందేమీ లేదు. మంత్రి చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలి. వైస్సార్సీపీ ప్రభుత్వం ఎప్పుడూ కులాల మధ్య చిచ్చు పెట్టలేదని సూర్య ప్రకాష్ అన్నారు.