చంద్రబాబూ.. రైతుల ఉసురుపోసుకోవద్దు: వైఎస్‌ జగన్‌ | YS Jagan Criticizes Chandrababu Over Farmers Crop Insurance Premium: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

చంద్రబాబూ.. రైతుల ఉసురుపోసుకోవద్దు: వైఎస్‌ జగన్‌

Oct 30 2024 5:41 AM | Updated on Oct 30 2024 7:50 AM

YS Jagan Criticizes Chandrababu Over Farmers Crop Insurance Premium: Andhra Pradesh

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

రైతుల పంటల బీమా ప్రీమియం మీకు భారమా?

ఈ ఏడాది మీరు ప్రీమియం ఎగ్గొట్టడం వల్ల రైతులకు రూ.1,385 కోట్ల నష్టం

ఉచిత పంటల బీమా పథకం రద్దుపై పునరాలోచన చేయండి 

ప్రీమియం మొత్తం ప్రభుత్వమే భరించాలి.. లేదంటే రైతులు ఎప్పటికీ క్షమించరు 

మా ప్రభుత్వ హయాంలో 5.52 కోట్ల ఎకరాలకు బీమా 

ఐదేళ్లలో రూ.3,022.26 కోట్ల ప్రీమియం చెల్లించాం 

54.55 లక్షల మందికి రూ.7,802.08 కోట్ల పరిహారం ఇచ్చాం 

వైఎస్సార్‌ రైతు భరోసా కింద రూ.34,288.17 కోట్ల సాయం అందించాం   

ఆర్బీకే వ్యవస్థ ద్వారా విత్తు నుంచి పంట విక్రయం వరకు అండగా నిలిచాం 

మీ సూపర్‌ సిక్స్‌ హామీల మేరకు రూ.20 వేల పెట్టుబడి సాయం ఏదీ?

రబీ సీజన్‌ నుంచి పంటల బీమా ప్రీమియం రైతులే చెల్లించాలంటూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రైతుల తరఫున ప్రీమియం వాటా చెల్లించడం మీ ప్రభుత్వానికి భారమా చంద్రబాబూ?’ ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు చేశారు. అందులో ఇంకా ఏమన్నారంటే..    
– సాక్షి, అమరావతి

1. వైఎస్సార్‌సీపీ హయాంలో రైతులపై పైసా భారం పడకుండా ఐదేళ్లపాటు ఉచిత పంటల బీమా పథకాన్ని విజయవంతంగా అమలు చేశాం. 
2. నోటిౖఫై చేసిన ప్రతి పంటకూ, సాగైన ప్రతి ఎకరాకు యూనివర్సల్‌ కవరేజీ కల్పిస్తూ రైతులకు పూర్తి స్థాయిలో బీమా రక్షణ కల్పించాం.
3.మా ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో రైతులపై పైసా భారం పడకుండా 5.52 కోట్ల ఎకరాలకు బీమా కవరేజీ కల్పించాం. 2.04 కోట్ల మంది రైతులకు బీమా రక్షణ కల్పించాం. 

4.  మా ప్రభుత్వ హయాంలో ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి సంబంధించిన బీమా పరిహా­రాన్ని మరుసటి ఏడాది అదే సీజన్‌ ప్రారంభంలో రైతుల ఖాతాలో జమ చేస్తూ వారికి అండగా నిలిచాం. 2014–19 మధ్య మీ ప్రభుత్వ హయాంలో 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్ల పరి­హా­రం చెల్లిస్తే.. మా ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో 54.55 లక్షల మందికి రూ.7,802.08 కోట్ల బీమా పరిహా­రాన్ని నేరు­గా వారి ఖాతాలకు జమ చేశాం.
5. రైతుల తరఫున ఐదేళ్లలో రూ.3,022.26 కోట్ల ప్రీమి­యం మొత్తాన్ని మా ప్రభు­త్వం బీమా కంపెనీలకు చెల్లించింది. 
6. గతంలో బీమా చేయించుకు­న్న వారు సైతం పరిహారం కోసం అధికారులు, బీమా కంపెనీల చుట్టూ చెప్పులరిగేలా తిరిగేవారు.

7. 2023–24 సీజన్‌లో రైతుల తరఫున ప్రీమి­యం మొత్తం రూ.930 కోట్లను ఈ ఏడాది జూన్‌లో మీరు చెల్లించకుండా ఎగ్గొట్టడం వల్ల ఆ సీజ­న్‌లో వర్షాభావ పరిస్థితులు, భారీ వర్షాలు, తుపానుల వల్ల పంటలు నష్టపో­యిన రైతులకు రూ.1,385 కోట్ల పరిహారం అందకుండా పోయింది.
8. మా హయాంలో ఇచ్చిన మాటకు మించి ఏటా మూడు విడతల్లో ఎకరాకు రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందించి సాగు వేళ రైతులకు 
అండగా నిలిచాం.    

9. వైఎస్సార్‌ రైతు భరోసా కింద ఐదేళ్లలో 53.58 లక్షల మంది రైతులకు రూ.34,288.17 కోట్ల­ను నేరుగా బ్యాంక్‌ ఖాతాలకు జమచేసి వారికి వెన్నుదన్నుగా నిలిచాం. దేశంలోనే తొలిసారిగా గ్రామ స్థాయిలో ఆర్బీకే వ్యవ­స్థను ఏర్పాటు చేసి, వాటి ద్వారా విత్తు నుంచి పంట విక్రయం వరకు రైతులను చేయిపట్టి నడిపించాం.
10. తొలిసారిగా ఈ–క్రాప్‌ ద్వారా సాగు చేసిన ప్రతి ఎకరాలో సాగైన ప్రతి పంటనూ నమో­దు చేస్తూ.. ఈ క్రాప్‌ ప్రామాణికంగా రైతు క్షేత్రం వద్ద వారు పండించిన పంట ఉత్పత్తు­లను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి వెన్నుదన్నుగా నిలిచాం. ఈ–క్రాప్‌ ప్రామాణి­కంగా పంట రుణాలు అందించడంతోపాటు పంటల బీమా, పంట నష్ట పరిహారం, సున్నా వడ్డీ రాయితీ వంటి సంక్షేమ ఫలాలు అందించాం.

11. మీరు అధికారంలోకి వచ్చి 5 నెలలు కావస్తున్నా.. సూపర్‌ సిక్స్‌లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకూ ఇస్తానన్న రూ.20 వేల పెట్టు­బడి సాయంలో ఒక్కపైసా కూడా అందించలేదు.
12. ఖరీఫ్, రబీ సీజన్లలో పెట్టు­బడి కోసం రైతులు అష్టక­ష్టాలు పడుతు­న్నారు. ప్రైవే­టు వడ్డీ వ్యాపా­రులను ఆశ్ర­యించి రూ.3నుంచి రూ.5 వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టు­బడులు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది.

13. ఇప్పుడు రైతులకు ఐదేళ్లుగా అన్ని విధాలుగా ఎంతగానో అండగా నిలిచిన ఉచిత పంటల బీమా పథకానికి మంగళం పాడేశావు. గతంలో మాదిరిగా ప్రీమియం భారాన్ని తిరిగి రైతుల నెత్తిన మోపావు.
14. ఐదేళ్లుగా రైతులకు అన్నివిధాలుగా అండగా నిలిచిన ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తివేయడం రైతులకు నువ్వు చేస్తున్న ఘోరమైన అన్యాయం.
15. అసలే పుట్టెడు కష్టాల్లో ఉన్న రైతులపై పంటల 
బీమా ప్రీమియం భారం మోపడం భావ్యం కాదు. 

16. రైతులను బాధ­పెట్టిన వారు బాగుపడినట్టుగా చరిత్రలో ఎక్కడా లేదు. వాళ్ల ఉసురుపోసుకోవద్దు.
17. ‘తక్షణమే ఉచిత పంటల బీమా పథకం రద్దు చేసే 
విష­యంలో పునరాలోచించాలి. 
18. రైతుల తరఫున ప్రీమియం మొత్తం ప్రభుత్వమే భరించాలి. లేకుంటే రైతులు ఎప్ప­టికీ నిన్ను క్షమించరు చంద్రబాబు..! 

Advertisement
 
Advertisement
Advertisement