ఇంటికో ఉద్యోగమని మొండిచేయి చూపారు: వైఎస్‌ షర్మిల

Telangana: YSRTP YS Sharmila Slams On CM KCR - Sakshi

కోదాడ: తెలంగాణ ఏర్పడిన తరువాత ఇంటికో ఉద్యోగం కల్పిస్తానని అధికారంలోకి వచ్చిన కేసీఆర్, ఎనిమిదేళ్ల కాలంలో ఒక్క ఉద్యోగమూ ఇవ్వ కుండా నిరుద్యోగులకు మొండిచేయి చూపారని వైఎస్సార్‌ టీపీ రాష్ట్ర అధ్య క్షురాలు షర్మిల విమర్శించారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజక వర్గ పరిధిలోని అనంతగిరి మండల కేంద్రంలో మంగళవారం ఆమె నిరు ద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. కేసీఆర్‌ కుటుంబంలో అందరికీ ఉద్యో గాలు ఇచ్చుకున్నాడని, నిరుద్యోగు లను మాత్రం పట్టించుకోలేదని మండి పడ్డారు. వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో మూడు సార్లు మెగా డీఎస్సీ నిర్వహించి లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారని గుర్తు చేశారు. ఇప్పుడు ఉద్యోగాలు లేక నిరుద్యో గులు ఆత్మహత్య లకు పాల్పడుతుంటే.. కనీసం వారి కుటుంబాలను పరామర్శించిన దిక్కు కూడా లేదన్నారు.

బాసర ట్రిపుల్‌ఐటీలో కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫల మైందని విమర్శించారు. విద్యార్థులు ధర్నా చేస్తున్నా సీఎం కేసీఆర్‌ పట్టించు కోకపోవడం దారుణమన్నారు. విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్‌ రాక పోవడంతో చదువును మధ్యలోనే మానేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారం లోకి వచ్చిన వెంటనే ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేస్తామని, కార్పొ రేషన్‌ రుణాల కోసం దరఖాస్తు చేసిన 10 లక్షల మంది నిరుద్యోగులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్‌ రంగంలోనూ ఉద్యో గాలు కల్పిస్తామ న్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పిట్టా రామిరెడ్డి, పచ్చిపాల వేణుయాదవ్, జిల్లేపల్లి వెంకటేశ్వర్లు, లంకెల కృష్ణారెడ్డి, ఉపేందర్, కన్నె కొండల్‌రావు పాల్గొన్నారు 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top