బండి సంజయ్‌పై విరుచుకుపడ్డ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ | Telangana Minister Srinivas Goud Fire On Bandi Sanjay | Sakshi
Sakshi News home page

బండి సంజయ్‌పై విరుచుకుపడ్డ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

May 6 2022 11:45 AM | Updated on May 6 2022 12:02 PM

Telangana Minister Srinivas Goud Fire On Bandi Sanjay - Sakshi

బీసీ మంత్రి అని కూడా చూడకుండా ఇష్టానుసారం మాట్లాడుతుండడం ఏంటంటూ.. బండి సంజయ్‌పై తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మండిపడ్డారు.

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌. తెలంగాణ భవన్‌లోని టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో శుక్రవారం ప్రెస్‌ మీట్‌ నిర్వహించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌.. పాదయాత్రల పేరిట పచ్చబడ్డ పాలమూరు పైన విషం చిమ్ముతున్నాడంటూ బండి సంజయ్‌ను విమర్శించారు.

పుట్టుకతోనే తెలంగాణ ఆగం చేసిన  పార్టీ బీజేపీ.. పాలమూరుకు సిగ్గు లేకుండా అన్యాయం చేసింది. పచ్చని పైర్లతో పాలమూరు ఉంటే కళ్ళకు గంతలు కట్టుకుని ఉన్నావా? అంటూ బండి సంజయ్‌పై మంత్రి శ్రీనివాస్‌ మండిపడ్డారు. ఈ క్రమంలో ఒకింత తీవ్ర పరుష పదజాలంతో బండి సంజయ్‌ను విమర్శించారు. కులం మతం అంటూ దేశంలో మాదరితే.. పాలమూరులో కూడా తిరుగుతున్నాడని, ఒక బీసీ మంత్రిపై ఇష్టానుసారం మాట్లాడడం ఏంటని? మండిపడ్డారు శ్రీనివాస్‌ గౌడ్‌.

చదవండి: మాటల్లో కాదు.. చేతల్లో పోటీ పడదాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement