సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై విచారణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనల తర్వాత ఈ పిటిషన్‌పై విచారణను హైకోర్ట్ సోమవారానికి వాయిదా వేసింది.
కాగా, బీఆర్‌ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావులపై అనర్హత వేటు వేయాలని పిటిషన్‌లో బీఆర్‌ఎస్ పేర్కొంది. కాగా, ఈ పిటిషన్‌పై అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ఇప్పటికే వాదనలు వినిపించారు. దీంతో, తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.


