టీడీపీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్‌కు ఎదురుదెబ్బ

TDP Kalava Srinivasulu Followers Joined In YSRCP In Anantapur - Sakshi

సాక్షి,  అనంతపురం: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో రాయదుర్గంలో టీడీపీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మున్సిపల్ మాజీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లు సోమమల్లేషప్ప, నాగప్ప, అరుడప్పలు  టీడీపీకి రాజీనామా చేశారు. ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి సమక్షంలో ఆదివారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

రాయదుర్గం పట్టణ 2వవార్డు టీడీపీ అభ్యర్ధి అనుదీపిక కూడా వైఎస్ఆర్‌సీపీలో చేరారు. వలసలతో పరువు కాపాడుకునేందుకు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్‌ పాట్లు పడుతున్నారు. దీంతో మాజీ మంత్రి కాల్వ.. టీడీపీ అభ్యర్ధులను కర్ణాటకకు తరలించారు. సుమారు 30 మందిని రహస్య ప్రాంతాలకు తరలించారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్లు విత్‌డ్రా చేసుకోవద్దంటూ పలువురు టీడీపీ అభ్యర్థులను నిర్బంధించారు.

చదవండి: జగన్‌ మోహన్‌ రెడ్డి వందశాతం ఉత్తమం: కొట్టేటి శిరీష 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top