Konaseema Issue: అన్యం సాయి జనసేనకు చెందిన వ్యక్తే: సజ్జల

Sajjala Ramakrishna Reddy On Konaseema Violence Accused Anyam Sai - Sakshi

సాక్షి, అమరావతి: కోనసీమ అల్లర్ల వెనుకున్న కుట్రకోణం స్పష్టంగా అర్థమవుతోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కొందరి ప్రవర్తనే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోందన్నారు. అమలాపురం దాడులపై ప్రతిపక్షాల స్పందన చూస్తుంటే.. వాళ్లే కథంతా నడిపించారనే అనుమానాలు బలపడుతున్నాయన్నారు. అల్లర్ల కేసులో నిందితులపై కఠిన చర్యలుంటాయన్నారు.

‘దాడులకు కారణం వైఎస్సార్‌సీసీనేని టీడీపీ, జనసేన ఆరోపణలు చేస్తున్నాయి. టీడీపీ, జనసేనవి దుర్మార్గపు రాజకీయ ఆలోచనలు. మా మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లపై మేమే దాడులు చేయించుకుంటామా? అన్యం సాయి జనసేనకు చెందిన వ్యక్తే. జనసేన కార్యక్రమాల్లో అన్యంసాయి పాల్గొన్న ఫోటోలు వచ్చాయి. విపక్షాల అరోపణలకు ఏమైనా అర్థం ఉందా.ఇలాంటి అడ్డగోలు ఆరోపణలు వారి విచక్షణకే వదిలేస్తున్నాం. పవన్‌ కల్యాణ్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. టీడీపీ కార్యాలయం నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ను పవన్‌ చదివారు.
చదవండి: కోనసీమ అల్లర్లు.. చంద్రబాబు స్క్రిప్టు పవన్ చదువుతున్నాడు: మంత్రి రోజా

అంబేద్కర్‌ పేరు విషయంలో టీడీపీ, జనసేన వైఖరి చెప్పాలి. అడ్డ దారుల్లో ప్రయోజనం పొందాలని చంద్రబాబు యత్నిస్తున్నారు. ఏం చెప్పాలనుకున్నారో పవన్‌కే తెలియడం లేదు. అల్లర్ల విషయం వదిలేసి ఏవేవో మాట్లాడుతున్నారు. టీడీపీ హయాంలో అత్యాచార ఘటనపై పవన్‌కు వివరాలు అందిస్తాం. కులం, మతాలను అడ్డుపెట్టుకొని మేం అధికారంలోకి రాలేదు. సీఎం జగన్‌ కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు’  అని సజ్జల అన్నారు.
చదవండి: అమలాపురం అల్లర్ల ఘటన: ‘ఆ రెండు పార్టీలు ఎందుకు ఖండిచడం లేదు’

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top