బీఎస్పీకి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ రాజీనామా | BSP Telangana President RS Praveen Kumar Resign To BSP Party, Know Details Inside - Sakshi
Sakshi News home page

బీఎస్పీకి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ రాజీనామా

Mar 16 2024 2:38 PM | Updated on Mar 16 2024 4:21 PM

rs praveen kumar resign to bsp party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ)కి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ గుడ్‌బై చెప్పారు. బీఎస్పీ పార్టీ తెలంగాణ చీఫ్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆర్‌ఎస్ ప్రవీణ్‌ కుమార్‌ ప్రకటించారు. ‘బహుజన్ సమాజ్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నాను. నా నాయకత్వంలో తెలంగాణలో ఇటీవల కాలంలో తీసుకున్న నిర్ణయాల (వాటికి ఎంత మంచి ప్రాముఖ్యత ఉన్నా) వల్ల బీఎస్పీ వంటి గొప్ప పార్టీ ఇమేజ్ దెబ్బతినడం నాకు ఇష్టం లేదు’ అని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.

 

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో భేటీ కానున్నారు. ఇటీవల బీఆర్‌ఎస్‌-బీఎస్పీ పార్టీలు లోక్‌సభ ఎన్నికల కోసం పొత్తు ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఎస్పీకి రాజీనామా చేసిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది.

బీఆర్‌ఎస్‌-బీఎస్పీ పొత్తులో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలలోని నాగర్‌ర్నూల్‌తో పాటు హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల నుంచి బీఎస్పీ పోటీ చేస్తుందని ఆ పార్టీ తెలంగాణ చీఫ్‌గా  ప్రవీణకుమార్‌ ప్రకటించారు. నాగర్‌కర్నూల్‌ స్థానం నుంచి స్వయంగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌(ఆర్‌ఎస్‌పీ) ఎన్నికలో బరిలో దిగనున్నారని బీఎస్పీ ప్రకటించింది. ఇక హైదరాబాద్‌ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలన్నదానిపై బీఎస్పీ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. ఇలాంటి తరుణంలో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ బీఎస్పీకి రాజీనామా చేయటం పార్టీకి పెద్ద షాక్‌ అని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement