‘కన్నా నీ చరిత్ర నాకు తెలుసు.. దమ్ముంటే చర్చకు రావాలి’ | Rathamsetty Seetharamanjaneyulu Open Challenge To Kanna Lakshminarayana | Sakshi
Sakshi News home page

కన్నా నీ చరిత్ర నాకు తెలుసు.. దమ్ముంటే చర్చకు రావాలి: సీతారామాంజనేయులు

Jun 18 2023 2:33 PM | Updated on Jun 18 2023 8:19 PM

Rathamsetty Seetharamanjaneyulu Open Challenge To Kanna Lakshminarayana - Sakshi

సాక్షి, గుంటూరు: జీడీసీసీ బ్యాంకు, ప్రభుత్వంపై కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని జీడీసీసీ బ్యాంకు ఛైర్మన్‌ రాతంశెట్టి సీతారామాంజనేయులు అన్నారు. బ్యాంకులో రూ.500కోట్ల కుంభకోణం జరిగిందని కన్నా చెబుతున్నారు. ఆయనకు దమ్ముంటే కుంభకోణం జరిగిందని నిరూపించాలని సవాల్‌ విసిరారు. 

కాగా, బ్యాంక్ చైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. కుంభకోణం జరిగిందని కన్నా నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. లేకపోతే కన్నా రాజకీయాల నుంచి తప్పుకోవాలి. కన్నా లక్ష్మీనారాయణ నిజాయితీపరుడో లేక నేను నిజాయితీపరుడినో చర్చికుందాం చర్చకు రావాలి. కన్నా నీ చరిత్ర అంతా నాకు తెలుసు. 90 గజాల రేకుల షెడ్డు నుంచి రూ.వేల కోట్లు ఎలా సంపాదించావో చెప్పు.

రైతులను మోసం చేసింది ధూళిపాళ్ల నరేంద్ర. రైతులకు సంబంధించిన సంగం డెయిరీని దొంగతనం చేసింది ధూళిపాళ్ల నరేంద్ర. కన్నాకు దమ్మంటే రైతులకు సంబంధించిన సంగం డెయిరీని దూళిపాళ్ల నరేంద్ర నుంచి రైతులకు ఇప్పించాలి అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: పవన్‌.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడు..: కాపు మహిళా నేతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement