త్వరలో తెలంగాణకు ప్రధాని మోదీ! | PM Modi Will Visit Telangana Soon | Sakshi
Sakshi News home page

త్వరలో తెలంగాణకు ప్రధాని మోదీ!

Mar 21 2026 10:50 AM | Updated on Mar 21 2026 11:09 AM

PM Modi Will Visit Telangana Soon

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే తెలంగాణలో పర్యటించనున్నట్టు సమాచారం. రానున్న పది, పదిహేను రోజుల్లో మోదీ పర్యటన ఉండే అవకాశం ఉంది. మోదీ పర్యటన, జీహెచ్‌ఎంసీ ఎన్నికలే ప్రధాన ఎజెండాగా కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి నేడు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు.

వివరాల మేరకు.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ.. తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో మోదీ తెలంగాణలో కూడా పర్యటించేలా స్థానిక నేతలు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా బీబీనగర్ ఎయిమ్స్ ప్రారంభోత్సవం సహా పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. అలాగే, గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల కోసం పరేడ్ గ్రౌండ్లో ప్రధాని మోదీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్ చేస్తోంది.  

ఇక, ఇప్పటికే స్థానిక నేతలకు మోదీ టూర్‌పై రాష్ట్ర నాయకత్వం సంకేతాలు  ఇచ్చినట్టు సమాచారం. ఇందులో భాగంగానే నేడు సికింద్రాబాద్ నేతలతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటర్నల్ సమావేశం ఏర్పాటుచేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, మోదీ టూర్ ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం. కాగా, మోదీ పర్యటనతో రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో జోష్‌ పెరిగే అవకాశం ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement