
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఎంపికైన ఎంపీలందరీ 18వ పార్లమెంట్ సమావేశాలకు స్వాగతం పలుకుతున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆయన 18వ పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ కొత్త లక్ష్యాలను చేరుకోవడానికి మనమంతా కృషిచేయాలి. వికసిత్ భారత్ లక్ష్యాన్ని మనం అందుకోవాలి. కొత్త ఆశలు, కొత్త ఉత్సాహంతో ముందుకు సాగాలి.
స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండోసారి దేశ ప్రజలు వరుసగా తమకు మూడోసారి ప్రభుత్వ సేవలందించే అవకాశం కల్పించినందున ఈ ఎన్నికలు కూడా అత్యంత కీలకంగా మారాయి. ఎమర్జెన్సీ ద్వారా ప్రజాస్వామ్యంపై పడిన మచ్చకు రేపు (జూన్ 25)తో 50 ఏళ్లు పూర్తి అవుతుంది. 50 ఏళ్ల క్రితం జరిగిన తప్పును మరెవరూ చేయకూడదు. భారత రాజ్యాంగం ఆదేశాల మేరకు సామాన్య ప్రజల కలలను నెరవేర్చేందుకు మేము తీర్మానం చేస్తాం.

దేశ ప్రజలు మూడోసారి పరిపాలన చేయాలని మాకు అవకావం కల్పించారు. మాకు పెద్ద విజయాన్ని ప్రజలు అందించారు. దీంతో మా బాధ్యత కూడా మూడు రెట్లు పెరిగింది. నేను దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా. మా మూడో టర్మ్ పాలనలో మూడు రెట్లు ఎక్కువ కృషి చేసి.. అంతే స్థాయిలో ఫలితాలను అందిస్తాం’’ అని మోదీ అన్నారు.
#WATCH | PM Narendra Modi says, "...The 18th Lok Sabha is starting today. The world's largest election was conducted in a very grand and glorious manner... This election has also become very important because for the second time after independence, the people of the country have… pic.twitter.com/bASHVtfh3S
— ANI (@ANI) June 24, 2024