‘ఏపీలో టీడీపీకి దిక్కులేదు.. రేపో మాపో మూసేస్తారు’ | minister Jogi Ramesh Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘ఏపీలో టీడీపీకి దిక్కులేదు.. రేపో మాపో మూసేస్తారు’

Dec 4 2022 4:39 PM | Updated on Dec 4 2022 4:59 PM

minister Jogi Ramesh Slams Chandrababu Naidu - Sakshi

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో టీడీపీ రోజురోజుకూ దిగజారిపోతుందని మంత్రి జోగి రమేష్‌ విమర్శించారు. ఏపీలో టీడీపీకి దిక్కులేదని, రేపో-మాపో ఆ పార్టీని మూసేస్తారని ఎద్దేవా చేశారు మంత్రి. ఆదివారం తాడేపల్లి నుంచి ప్రెస్‌మీట్‌ ద్వారా మాట్టాడిన మంత్రి జోగి రమేష్‌.. ‘ చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు చేసిన అభివృద్ధి శూన్యం.  ఏం చేశారని చంద్రబాబు మళ్లీ ఓటేయాలి.

చంద్రబాబు, పవన్‌ ఇద్దరూ ప్రజలను రెచ్చగొడుతున్నారు. చంద్రబాబుది విష ప్రచారమని ప్రజలు తిట్టుకుంటున్నారు. చంద్రబాబును నమ్మే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు లేరు. ఏపీలో టీడీపీ దిక్కులేదు.. రేపో మాపో మూసేస్తారు. నారా లోకేష్‌ రాజకీయ అజ్ఞాని.దొడ్డిదారిన ఎమ్మెల్సీ, మంత్రి అయిన వ్యక్తి లోకేష్‌’ అని ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement