‘వ్యక్తిగత అభిప్రాయాలతో పార్టీకి సంబంధం లేదు’ | GVL Narasimha Rao Comments On AP Capital Issue | Sakshi
Sakshi News home page

‘వ్యక్తిగత అభిప్రాయాలతో పార్టీకి సంబంధం లేదు’

Aug 6 2020 5:36 PM | Updated on Aug 6 2020 6:04 PM

GVL Narasimha Rao Comments On AP Capital Issue - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అంశం కేంద్ర పరిధిలో లేదన్నదే తమ పార్టీ అధికారిక విధానమని బీజేపీ జాతీయ అధికారిక ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు మరోసారి స్పష్టం చేశారు. కొందరు నేతలు వారి వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీ లైన్‌కు విరుద్ధంగా చెబుతున్నారని జీవీఎల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ అగ్ర నేతలతో చర్చించిన తర్వాతే రాజధాని అంశంపై తమ అధికారిక విధానాన్ని ప్రకటించామని తెలిపారు. తమ పార్టీ విధానాన్ని కేంద్ర హోంశాఖ అధికారికంగా హైకోర్టులో వెల్లడించిందని గుర్తుచేశారు. కావాలనే కొందరు బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని జీవీఎల్ మండిపడ్డారు. నాయకుల వ్యక్తిగత అభిప్రాయాలతో పార్టీకి సంబంధం లేదన్నారు. వ్యక్తిగత ప్రకటనలకు మీడియా ప్రాధాన్యత ఇచ్చి బీజేపీని టార్గెట్‌ చేయవద్దని కోరారు. (చదవండి : ‘ఈనాడు ఇటువంటి వార్తలు రాయడం బాధాకరం’)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement