
సాక్షి, కృష్ణా జిల్లా: కేటీఆర్ నోటి రంగు తగ్గించుకుంటే బాగుంటుందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు కూడా జగన్ తమకు సీఎం అయితే బావుండని కోరుకుంటున్నారు. కేసీఆర్, కేటీఆర్ నోటి వెంట వచ్చే మాటలు నీటి మీద రాతలే. ఏది పడితే అది మాట్లాడొద్దని కేటీఆర్‌కు సూచిస్తున్నానన్నారు.
చదవండి: కేటీఆర్‌కు మంత్రి అప్పలరాజు సవాల్.. ‘40 బస్సులు వేసుకొని రండి’
‘‘ కరోనా సమయంలో ఎన్నో వేల మంది ప్రాణాలు కాపాడుకోవడానికి హైదారాబాద్ నుంచి ఏపీకి పరుగెత్తుకొచ్చారు. ఈ విషయం కేటీఆర్ గుర్తుచేసుకుంటే మంచిది. ఏపీకి ట్రాన్స్ ఫర్ అయి వెళ్లిపోతే బాగుండని ఎందరో మధ్య తరగతి ప్రజలు కోరుకున్నారని’’ పేర్ని నాని అన్నారు.