Congress MLA Komatireddy Rajgopal Reddy Comments On Munugode Bypolls - Sakshi
Sakshi News home page

మునుగోడు ఉపఎన్నిక ఖాయం!.. రాజగోపాల్‌రెడ్డి హాట్‌ కామెంట్స్‌

Jul 30 2022 12:20 PM | Updated on Jul 30 2022 1:50 PM

Congress MLA Komatireddy Raj Gopal Reddy Comments Munugode Bypoll - Sakshi

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో ఉప ఎన్నిక ఖాయమంటూ ఆయన వ్యాఖ్యానించారు. శనివారం సీనియర్‌ నేత ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పార్టీ ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డితో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

మునుగోడు ప్రజలు భావిస్తే ఉపఎన్నిక వస్తుంది. మునుగోడు ఉపఎన్నికపై తెలంగాణవ్యాప్తంగా చర్చ జరగాలి.  మునుగోడు తీర్పు తెలంగాణలో మార్పునకు నాంది కావాలి.  ఆ ఉప ఎన్నికతో తెలంగాణలో తప్పక మార్పు వస్తుంది. నేను కేసీఆర్‌పై ధర్మ యుద్ధం చేస్తున్నా. పదిహేనురోజుల్లో నా నిర్ణయం ఉంటుంది. అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 

ఇదిలా ఉంటే.. ఉత్తమ్‌, వంశీచంద్‌రెడ్డిలతో ఢిల్లీ రావాలంటూ కాంగ్రెస్‌ కీలక నేత రాహుల్‌ గాంధీ, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కబురు పంపినట్లు సమాచారం. అయితే.. కోమటిరెడ్డి మాత్రం అందుకు సుముఖంగా లేనట్లు ఆయన మాటల్ని బట్టి తెలుస్తోంది. మరోవైపు ఆదివారం నుంచి ఆయన తన నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నిజయోకవర్గంలో పర్యటించిన తర్వాతే ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై ఆయన ఒక ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement