సీఎం రేవంత్‌ సమక్షంలో కాంగ్రెస్‌లోకి పోచారం.. ఇంటి వద్ద హైటెన్షన్‌ | Telangana CM Revanth Reddy Meets Former Assembly Speaker Pocharam Srinivas Reddy | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌ సమక్షంలో కాంగ్రెస్‌లోకి పోచారం.. ఇంటి వద్ద హైటెన్షన్‌

Published Fri, Jun 21 2024 11:03 AM | Last Updated on Fri, Jun 21 2024 4:22 PM

CM Revanth Reddy Meets Ex Speaker Pocharam Srinivas

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. రాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌ రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం, ఆయన కాంగ్రెస్‌ పార్టీ చేరారు.

కాగా, తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డితో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ అయ్యారు. పోచారం ఇంటికి రేవంత్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ వెళ్లారు. ఈ క్రమంలో తాజా రాజకీయాలపై చర్చించారు. అనంతరం, రేవంత్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించడంతో పోచారం ఓకే చెప్పారు. ఆ తర్వాత పోచారం శ్రీనివాస రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్‌ రెడ్డి హస్తం పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి సీఎం రేవంత్‌ రెడ్డి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. రైతులకు పోచారం అండగా నిలిచారు. పోచారం సలహాతో రైతులకు మేలు జరుగుతుందని ఆయనను కలిశాను. మాను అండగా నిలవాలని కోరాము. పార్టీలో శ్రీనివాస రెడ్డికి తగిన గౌరవం ఇస్తాం. తెలంగాణ పునర్‌నిర్మాణంలో భాగంగా ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారు అని కామెంట్స్‌ చేశారు.

మాజీ స్పీకర్‌ పోచారం మాట్లాడుతూ.. ‘రైతుల కష్టాల తీరాలని కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నాను. కొత్త ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు రైతులకు మద్దతుగా ఉన్నాయి. ఎన్ని సమస్యలు వచ్చినా రేవంత్‌ రెడ్డి ధైర్యంతో ముందుకు వెళ్తున్నారు. రేవంత్‌ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్నాను. నేను ఆశించే పదవులు ఏమీ లేవు. ఆరు నెలలుగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పాలన కొనసాగిస్తోంది. నా రాజకీయ జీవితం కాంగ్రెస్‌లోనే ప్రారంభమైంది. రాష్ట్ర ప్రగతి, రైతుల కోసం పనిచేస్తాను’ అని అన్నారు. 

మరోవైపు.. మాజీ స్పీకర్‌ పోచారం ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోచారం శ్రీనివాస్‌కు నివాసం వద్దకు బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌, పార్టీ శ్రేణులు చేరుకున్నారు. పోచారం కాంగ్రెస్‌ పార్టీ చేరుతున్నారనే వార్తల నేపథ్యంలో వారంతా ధర్నాను దిగారు. ఇక, అంతకుముందు సీఎం రేవంత్‌ కాన్వాయ్‌ను బీఆర్‌ఎస్‌ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో హైటెన్షన్‌ నెలకొంది. బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement