ఇళ్లులేని పేదలకు పీఎంఏవై ఫలాలు అందాలి | Central Minister Kishan Reddy Letter To CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

ఇళ్లులేని పేదలకు పీఎంఏవై ఫలాలు అందాలి

Aug 14 2024 5:44 AM | Updated on Aug 14 2024 5:44 AM

Central Minister Kishan Reddy Letter To CM Revanth Reddy

ఆ మేరకు సహకరించండి 

సీఎం రేవంత్‌రెడ్డికికేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ 

గత ప్రభుత్వంలా వ్యవహరించొద్దని సూచన

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేదలకు ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (గ్రామీణ) ఫలాలను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం అందించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు మంగళవారం కిషన్‌రెడ్డి సీఎం రేవంత్‌కి లేఖ రాశారు. సొంతిల్లు అవసరమున్న ప్రజలు లక్షలాదిమంది ఉన్నా.. 2018లో కేంద్ర ప్రభుత్వం ఇళ్ల కోసం నిర్వహించిన సర్వేలో గత ప్రభుత్వం భాగం కాలేదని, జాబితా కూడా పంపలేదని గుర్తుచేశారు. రాష్ట్రంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న కేసీఆర్‌ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పేరుతో పేద ప్రజలకు ఆశ చూపించి మభ్యపెట్టిందని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వ సహకారం తెలంగాణ ప్రజలకు అందకుండా అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో తాను చేపట్టిన పర్యటనల్లో చాలా మంది ప్రజలు సొంతింటి నిర్మాణం కోసం అభ్యరి్థంచారని  తెలిపారు. ఇదే విషయాన్ని ఈనెల 9న జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ దృష్టికి తీసుకెళ్లగా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన ప్రతిపాదనలు వస్తే ఇళ్లను కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారని కిషన్‌రెడ్డి వివరించారు.

ఈ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించి, కేంద్ర ప్రభుత్వం ఇళ్ల కోసం నిర్వహించనున్న సర్వేలో పాల్గొనాలని కోరారు. గ్రామీణ తెలంగాణలో సొంతిల్లు అవసరం ఉన్న పేద కుటుంబాల జాబితాను వీలయినంత త్వరగా తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి అందించాలని సూచించారు. ఆ మేరకు సంపూర్ణ సహకారం అందిస్తారని కోరుకుంటున్నట్లు రేవంత్‌రెడ్డికి రాసిన లేఖలో కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.  

విద్యారంగంపై వాళ్లది నేరమయ నిర్లక్ష్యం 
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై కిషన్‌రెడ్డి ధ్వజం 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యారంగంపై కాంగ్రెస్, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు నేరమయ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి,, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. తాజాగా ప్రకటించిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) లో... రాష్ట్ర ప్రభుత్వ అధ్వర్యంలో నిర్వహించే విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల పనితీరు బయటపడిందని వివరించారు. ఈ మేరకు కిషన్‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 

ఉస్మానియాకు 70వ ర్యాంకా? 
‘ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ ఓవరాల్‌ విభాగంలో.. ఉ స్మానియా వర్సిటీ 70వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. కొన్నేళ్లుగా ర్యాంకింగ్‌ను మెరుగుపర్చుకోవడం అ టుంచితే, ఉన్న స్థానాన్ని నిలబెట్టుకోవడంలోనూ విఫలమై మన యూనివర్సిటీలు దిగజారుతున్నా యి. కళాశాల విభాగంలో టాప్‌ 100లో తెలంగాణ నుంచి ఒక్క కాలేజీకీ స్థానం దక్కలేదు.’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితైతే మరింత అధ్వానంగా ఉంది. ఐటీ క్యాపిటల్‌గా చెప్పుకునే తెలంగాణలో పాఠశాలల్లో కంప్యూటర్లు, ఇంటర్నెట్‌ సదుపాయం లేదు.. 24వేలకు పైగా టీచర్‌ పోస్టులు ఖాళీగా పెట్టారంటే పేదలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలపై వీరికున్న ప్రేమేంటో అర్థమవుతోంది’’అని కిషన్‌రెడ్డి విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement