సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై సీఈఓ సుదర్శన్ రెడ్డికి బీజేపీ ఫిర్యాదు చేసింది. మోడల్ కోడ్ ఉల్లంఘనపై సీఎంపై ఎస్ఈసీకి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులో బీజేపీ పేర్కొంది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దేశ సైన్యాన్ని అవమానపర్చేవిధంగా ఉన్నాయని బీజేపీ ఆరోపిస్తోంది.
సైన్యంపై తప్పుడు, అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఎన్నికల నియమావళి ఉల్లంఘనగా పరిగణించాలంటూ విజ్ఞప్తి చేసింది. “దేశ భద్రతా బలగాల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా సీఎం వ్యాఖ్యలు ఉన్నాయని.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమైవని బీజేపీ మండిపడుతోంది.


