రేపు బీజేపీ ఆఫీసుకు వస్తా... కేజ్రీవాల్‌ ఓపెన్‌ ఛాలెంజ్‌ | Sakshi
Sakshi News home page

రేపు బీజేపీ ఆఫీసుకు వస్తా... కేజ్రీవాల్‌ ఓపెన్‌ ఛాలెంజ్‌

Published Sat, May 18 2024 7:08 PM

Arvind Kejriwal Open Challenge To Pm Modi Bjp

న్యూఢిల్లీ: ఎంపీ స్వాతిమలివాల్‌పై దాడి కేసులో తన సహాయకుడు బిభవ్‌కుమార్‌ అరెస్టయిన తర్వాత ఆమ్‌ఆద్మీపార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఫైరయ్యారు. బీజేపీకి ఓపెన్‌ ఛాలెంజ్‌ విసిరారు. ఆదివారం(మే19) తన పార్టీ నేతలతో కలిసి బీజేపీ ప్రధాన కార్యాలయానికి వస్తానని, ఎవరిని కావాలంటే వారిని అరెస్ట్‌ చేసుకోవచ్చని ఛాలెంజ్‌ చేశారు.

‘మోదీజీ మీరు జైల్‌ గేమ్‌ ఆడుతున్నారు. మనీష్‌ సిసోడియా, సంజయ్‌సింగ్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇలా ఒకరి తర్వాత ఇంకొకరిని జైలుకు పంపుతున్నారు. నా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి రేపు మధ్యాహ్నం 12  గంటలకు ఢిల్లీ బీజేపీ ఆఫీసుకు వస్తా. ఎవరిని కావాలంటే వారిని జైల్లో పెట్టండి. మొత్తం అందరినీ ఒకేసారి అరెస్ట్‌ చేయండి’అని కేజ్రీవాల్‌ సవాల్‌ విసిరారు. 

ఆప్‌ను లేకుండా చేయాలని బీజేపీ చూస్తోందని, అయితే ఆప్‌ ప్రజల గుండెల్లో ఉందని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. కాగా, కేజ్రీవాల్‌ ఓపెన్‌ ఛాలెంజ్‌పై  ఢిల్లీ బీజేపీ చీఫ్‌ వీరేంద్ర సచ్‌దేవ స్పందించారు. ఎంపీ స్వాతిమలివాల్‌పై మీ ఇంట్లోనే దాడి జరిగితే ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement