ధర్మారం: ఖిలావనపర్తిలోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి రథోత్సవం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ పోల్‌దాసిరి సంతోష్, ఈవో కాంతారెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్లస్థలాలు కేటాయిస్తామన్నారు. ఆలయంలో ప్రత్యేక రథం, డైనింగ్ హాల్ కోసం రూ.15 లక్షలు మంజూరు చేశానని, మరో రూ.10 లక్షలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఎస్సై ప్రవీణ్‌కుమార్ బందోబస్తు పర్యవేక్షించారు. భక్తులు పాల్గొన్నారు.


