విధుల్లో పారదర్శకత ఉండాలి
జ్యోతినగర్(రామగుండం): పోలింగ్ విధులను పకడ్బందీగా నిర్వహించాలని కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీ సూచించారు. ఎన్టీపీ సీ కాకతీయ ఆడిటోరియంలో సోమవారం ప్రి సైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆమె మాట్లా డుతూ, విధుల్లో పారదర్శకత ఉండాలన్నారు. ట్రైనర్స్ శ్రీనివాస్, రాజేందర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, అంజన్‌కుమార్ వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. జిల్లా ఎన్నికల పరిశీలకులు ప ద్మజారాణి శిక్షణ తరగతులను తనిఖీ చేశారు. బల్దియా కమిషనర్‌లు మనోహర్, వెంకటేశ్, రమేశ్, ఎస్‌ఈ గురువీర, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఆర్వో ఆంజనేయులు, సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సెక్యూరిటీ సిబ్బంది కీలకం
గోదావరిఖని: సింగరేణి ఆస్తుల పరిరక్షణలో సెక్యూరిటీ సిబ్బంది పాత్ర కీలకమని ఆర్జీ –వ న్ జీఎం లలిత్‌కుమార్ అన్నారు. సెక్యూరిటీ సిబ్బందికి సోమవారం టార్చిలైట్లు, ఫైబర్ లా ఠీలు అందజేసి మాట్లాడారు. సెక్యూరిటీ అధి కారి వీరారెడ్డి, ఏఐటీయూసీ కార్యదర్శి రెడ్డి వెంకటస్వామి, జూనియర్ ఇన్‌స్పెక్టర్లు శ్రీని వా స్, మహ్మద్ అక్బర్‌అలీ, జమేదార్లు తిరుపతి, మురళికృష్ణ, ఓదెలు, శ్రీనివాస్, మొండ య్య, సదానందం, ఇంటలిజెన్స్ టీం రాధాకృష్ణ, మధు, తిరుపతి, రమేశ్ పాల్గొన్నారు.
క్వింటాల్ పత్తి రూ.7,831
పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్ లో సోమవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,831, కనిష్టంగా రూ.6,331, సగటు ధర రూ.7,531గా నమోదైందని మార్కెట్ ఇన్‌చార్జి కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. 416 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు వివరించారు.
మజ్దూర్ యూనియన్ నిరసన
రామగుండం: దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక రైల్వేస్టేషన్‌లో ఆందోళన చేశారు. 8వ వేతన సంఘం సిఫార్సులు వర్తింపజేయాలని, సేఫ్టీ కేటగిరీ సిబ్బందికి రిస్క్, హార్డ్‌షిప్ అలవెన్స్ చెల్లించాలనే తదితర డిమాండ్లతో నిరసన తెలిపారు. నేతలు మెట్ట రామారావు, ఓవై స్వామి, మోజెన్, ఆనంద్ రాథోడ్, అరవింద్, రాజ్‌కుమార్, రఘు, సతీశ్, గౌతమ్ ఉన్నారు.
హుండీల ఆదాయం లెక్కింపు
ఓదెల(పెద్దపల్లి): కొలనూర్ సమ్మక్క – సారలమ్మ జాతర హుండీల ద్వారా రూ.8,31,08 ఆదాయం సమకూరిందని జాతర కమిటీ చైర్మ న్ కొలిపాక మధునయ్య సోమవారం తెలిపా రు. సర్పంచ్ పల్లె కనుకయ్య, ఉపసర్పంచ్ పా కాల సంపత్‌రెడ్డి, ఓదెల మల్లన్న ఆలయ ఈవో సదయ్య, జూనియర్ అసిస్టెంట్ పాల్గొన్నారు.
గుండారంలో..
కమాన్‌పూర్(మంథని): గుండారం సమ్మక్క– సారలమ్మ జాతర హుండీలను లెక్కించగా.. రూ.2,13,286 ఆదాయం సమకూరిందని కమిటీ చైర్మన్ పిడుగు శంకర్ తెలిపారు. సర్పంచ్ జంగిలి పోచాలు, ఉప సర్పంచ్ అంబీర్ రాజేందర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
పకడ్బందీగా వ్యవహరించాలి
గోదావరిఖని: మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, సిబ్బంది నియామకంలో పకడ్బందీగా వ్యవహరించాలని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి సూచించారు. గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌ను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఈనెల 11న పోలింగ్ నేపథ్యంలో లా అండ్ ఆర్డర్, ప్రజాభద్రత తదితర అంశాలపై పో లీస్ అధికారులకు సూచనలు చేశారు. డీసీపీ వెంట ఏసీపీ రమేశ్, సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సైలు రమేశ్, మనోహర్, అనూష ఉన్నారు.
విధుల్లో పారదర్శకత ఉండాలి
విధుల్లో పారదర్శకత ఉండాలి
విధుల్లో పారదర్శకత ఉండాలి
విధుల్లో పారదర్శకత ఉండాలి


