నిబంధనల ప్రకారమే పాలన | - | Sakshi
Sakshi News home page

నిబంధనల ప్రకారమే పాలన

Feb 3 2026 7:16 AM | Updated on Feb 3 2026 7:16 AM

నిబంధనల ప్రకారమే పాలన

నిబంధనల ప్రకారమే పాలన

● కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి: గ్రామాల్లో నిబంధనల ప్రకారమే పాలన సాగాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచించారు. గ్రా మ పంచాయతీల్లో ప్రభుత్వ పాలనపై కార్యదర్శులతో కలెక్టరేట్‌లో సోమవారం ఆయన సమీక్షించా రు. ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులు విడుదల చే సిందని, వాటితో పారిశుధ్యం మెరుగుపర్చాలన్నా రు. ఈ ఏడాదిలో జీరో డెంగీ కేసులు లక్ష్యంగా పని చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఉపాధిహామీ పనులు తదితర అంశాలపై సూచన లు చేశారు. జెడ్పీ సీఈవో నరేందర్‌, డీఆర్డీవో కాళిందిని, హౌసింగ్‌ పీడీ రాజేశ్వర్‌ పాల్గొన్నారు.

ప్రాథమిక సామర్థ్యాలు అవవసరం

విద్యార్థులందరికీ ప్రాథమిక విద్యా సామర్థ్యాలు తప్పనిసరని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. విద్యా శాఖ అధికారులతో ఎఫ్‌ఎల్‌ఎన్‌ అమలుపై జరిగిన సమీక్షలో కలెక్టర్‌ మాట్లాడారు. మూడోతరగతి పూ ర్తయ్యే వరకు ప్రతీవిద్యార్థి ధారాళంగా చదవడం, రాయడం, కూడికలు, తీసివేతలు వంటి ప్రాథమిక గణిత సామర్థ్యాలు సాధించేలా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈనెల ఒకటి నుంచి ఏడో తేదీ వరకు ఎంపికచేసిన 54 గ్రామాల్లో ని ర్వహించే ప్రత్యేక పశువైద్య శిబిరాలను సద్వినియో గం చేసుకోవాలని కలెక్టర్‌ శ్రీహర్ష పడిరైతులను కో రారు. డీఈవో శారద, అకడమిక్‌ మానిటరింగ్‌ అధి కారి షేక్‌, ఎంఈవోలు, కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎన్ని కల కమిషనర్‌ రాణి కుముదిని నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్‌తోపాటు పెద్దపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్‌ హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement