● చైర్‌పర్సన్‌ కుర్చీపై నజర్‌ ● ఆశలు పెంచుకున్న అధికార పార్టీ ● ఎలాగైనా ఓడిస్తామంటూ ఎంట్రీ ఇచ్చిన ‘సింహం’ | - | Sakshi
Sakshi News home page

● చైర్‌పర్సన్‌ కుర్చీపై నజర్‌ ● ఆశలు పెంచుకున్న అధికార పార్టీ ● ఎలాగైనా ఓడిస్తామంటూ ఎంట్రీ ఇచ్చిన ‘సింహం’

Feb 3 2026 7:16 AM | Updated on Feb 3 2026 7:16 AM

● చైర్‌పర్సన్‌ కుర్చీపై నజర్‌ ● ఆశలు పెంచుకున్న అధికార

● చైర్‌పర్సన్‌ కుర్చీపై నజర్‌ ● ఆశలు పెంచుకున్న అధికార

● చైర్‌పర్సన్‌ కుర్చీపై నజర్‌ ● ఆశలు పెంచుకున్న అధికార పార్టీ ● ఎలాగైనా ఓడిస్తామంటూ ఎంట్రీ ఇచ్చిన ‘సింహం’

పెద్దపల్లిరూరల్‌: మున్సిపల్‌ పీఠం తమదేనని అధికార కాంగ్రెస్‌ ధీమా వ్యక్తం చేస్తోంది. ఆ పార్టీకి కు ర్చీ దక్కకుండా చేయాలని అసమ్మతివర్గం ఎత్తులు వేస్తోంది. దీంతో పెద్దపల్లి రాజకీయం వేడెక్కుతోంది. మొత్తం 36 వార్డులు ఉండగా, చైర్మన్‌ స్థానం బీసీ(జనరల్‌)కు కేటాయించారు.

అన్నివార్డుల్లో పోటీ

అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ 36 వార్డుల్లో అభ్యర్థులతో నామినేషన్లు వేయించాయి. బీజేపీ 27 వార్డుల్లోనే తమ అభ్యర్థులను బరిలో దింపింది. కాంగ్రెస్‌ను ఓడించడమే ధ్యేయంగా తెలంగాణ జా గృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సహకారంతో ఏఐఎఫ్‌బీ(ఆల్‌ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌) పార్టీ ‘సింహం’ గుర్తుతో ఎంట్రీ ఇచ్చిన మాజీ కౌన్సిలర్‌ కొలిపాక శ్రీనివాస్‌.. 26 మంది అభ్యర్థులతో జాబితా ప్రకటించారు. చైర్మన్‌ పీఠాన్ని దక్కించుకుంటామ ంటున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ జనసేన 9 వార్డుల్లో పోటీకి దిగింది.

అభివృద్ధిపై కాంగ్రెస్‌ ఆశలు

సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో పెద్దపల్లిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని కాంగ్రెస్‌ చెబుతోంది. పెద్దపల్లి, సుల్తానాబాద్‌ పీఠాలు దక్కించుకుంటామనే ధీమాతో ఉంది. గత పాలకులు అభివృద్ధిని విస్మరించారని, డీఎంఎఫ్‌టీ నిధులను ఇత ర ప్రాంతాలకు ఎత్తుకెళ్లారని ఆరోపిస్తోంది. ఆర్టీసీ బస్సు డిపో ఏర్పాటు చేస్తున్నామని, 4 పోలీస్‌స్టేషన్లు ఒకేసారి ప్రారంభించామని, పదెకరాల్లో జిల్లా కోర్టు సముదాయాలు, బైపాస్‌రోడ్డు, పార్క్‌, హిందూ శ్మశానవాటిక తదితర పనులు చేపడతా మని ఎమ్మెల్యే విజయరమణారావు ప్రకటించారు. సర్వే చేయించి గెలిచే సత్తా ఉన్నవారినే పోటీలో నిలిపామని, తమకు ఎవరూ పోటీ ఇవ్వలేరంటున్నారు.

బరిలో బీఆర్‌ఎస్‌, బీజేపీ..

బీఆర్‌ఎస్‌, బీజేపీలు కూడా తమ అభ్యర్థులను బరి లో నిలిపాయి. అయితే, ఆయా పార్టీలు, ప్రధాన నేతల నుంచి తమకు ఆశించిన మద్దతు లభించడం లేదని కొందరు భావిస్తున్నారు. బీజేపీలో గ్రూపు రా జకీయాలు అభ్యర్థుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చే స్తున్నాయి. మంగళవారం నామినేషన్ల ఉపసంహర ణ గడువు ముగిసి గుర్తులు కేటాయించిన తర్వాత ప్రచార పర్వంతో స్పష్టత వస్తుందని అంటున్నారు.

‘సింహం’ ఎంట్రీ.. మారిన రాజకీయం

మాజీ కౌన్సిలర్‌ కొలిపాక శ్రీనివాస్‌ చైర్మన్‌ పీఠంపై కన్నేశారు. కాంగ్రెస్‌లోని అసమ్మతివాదులు ఆయ నకు అండగా నిలుస్తున్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి పో టీచేయాలని తొలుత భావించి రాష్ట్ర నాయకత్వాన్ని ఆశ్రయించినా స్థానిక నేతల నుంచి వ్యతిరేకత వ చ్చిందని, దీంతోనే ఆ వ్యవహారం ఫలించలేదనే చర్చసాగుతోంది. దీంతో కమలనాథులను కలిసి కాషాయ తీర్థం తీసుకునేందుకు ఇంకో ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఓ వర్గం పార్టీ రాష్ట్ర నాయ కత్వం వద్దకు తీసుకెళ్లి సానుకూలత లభించేలా చేసిన ప్రయత్నాలపై మరోవర్గం అభ్యంతరం వ్య క్తం చేయడంతో.. గ్రూపు రాజకీయాలతో వేగలేమని భావించి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కలిసినట్లు సమాచారం.

పట్టుసాధించేందుకు ఇదో అవకాశమని..

పెద్దపల్లిలో పట్టు సాధించేందుకు మంచిఅవకాశమ ని భావించిన జాగృతి కవిత.. ఆశావహులకు ఆల్‌ఇండియా ఫార్వర్డ్‌బ్లాక్‌ పార్టీ బీఫామ్‌లు ఇప్పించిన ట్లు చర్చ సాగుతోంది. ఎన్నికల ప్రచారంలోనూ ఆమె పాల్గొని సింహం గుర్తు అభ్యర్థుల విజయానికి ప్రయత్నిస్తారని సమాచారం. దీంతో కొలిపాక శ్రీని వాస్‌.. 26 మంది అభ్యర్థులను బరిలో నిలిపి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఏదేమైనా ఈనె ల 13న జరిగే ఓట్ల లెక్కింపు, 16న నిర్వహించే చైర్మ న్‌ ఎన్నిక ఆశావహుల భవితవ్యం తేల్చుతాయి.

మున్సిపల్‌ సమాచారం

చైర్మన్‌ పీఠం బీసీ(జనరల్‌)

పట్టణ విస్తీర్ణం(చ.కి.మీ.లలో) 35.19

ఓటర్లు 43,789

పురుషులు 21,660

మహిళలు 22,126

ఇతరులు 03

వార్డులు 36

ప్రధాన పార్టీల అభ్యర్థులు

కాంగ్రెస్‌ 36

బీఆర్‌ఎస్‌ 36

బీజేపీ 27

ఫార్వర్డ్‌ బ్లాక్‌ 26

జనసేన 09

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement