సుందరంగా తీర్చిదిద్దుతా | - | Sakshi
Sakshi News home page

సుందరంగా తీర్చిదిద్దుతా

Feb 3 2026 7:16 AM | Updated on Feb 3 2026 7:16 AM

సుందర

సుందరంగా తీర్చిదిద్దుతా

పెద్దపల్లిరూరల్‌: జిల్లా కేంద్రం హోదాకు తగిన వి ధంగా పెద్దపల్లిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. మున్సిపల్‌ 12, 29, 31వ వార్డు కాంగ్రెస్‌ అభ్యర్థు లు జగదీశ్‌, ఇల్లందుల రజని, మంథని నర్సింగ్‌కు మద్దతుగా సోమవారం పట్టణంలో ఎన్నికల ప్రచా రం చేశారు. అంతకుముందు ఎల్లమ్మ చెరువు హను మాన్‌ ఆలయంలో పూజలు చేశారు. ఈనెల 11న జ రగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకే ఓటువేసి గెలిపించాలని కోరారు. సురేశ్‌గౌడ్‌, వ్యాపారవేత్త బాల్‌కిషన్‌ జాకొటియా, నాయకులు సత్యనారాయణరెడ్డి, రంగు శ్రీనివాస్‌ ఎడెల్లి శంకర్‌ ఉన్నారు.

కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలి

ఎలిగేడు(పెద్దపల్లి): మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే విజయరమణారావు సూచించారు. శివపల్లిలోని తన నివాసంలో కాంగ్రెస్‌ ముఖ్యనాయకులతో మున్సిపల్‌ ఎన్ని కల ప్రచారంపై సమీక్షించారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోనిప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రతీ ఇంటికి తీసుకెళ్లాలన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించేలా సహకరించాలని కోరారు.

ప్రతిభావంతులకు ప్రశంస

పెద్దపల్లి: అమర్‌చందర్‌ కల్యాణ మండపంలో సో మవారం టాలెంట్‌ టెస్ట్‌ నిర్వహించారు. జిల్లాస్థా యిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈకార్య క్రమంలో డీఈవో శారద, అధికారులు పీఎం షేక్‌, హనుమంతు, ఆగయ్య, పురుషోత్తం, లింగం శ్రీనివాస్‌, ముద్రబోయిన కుమారస్వామి, భాస్కర్‌ గడ్డం రాజనర్సు, కొండం శ్రీనివాసరెడ్డి, గుర్రం గంగారెడ్డి, మూల శ్రీనివాస్‌, రామచంద్రన్‌, పట్టెం వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

సుందరంగా తీర్చిదిద్దుతా 1
1/1

సుందరంగా తీర్చిదిద్దుతా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement