శాంతిభద్రతలు పరిరక్షించాలి
గోదావరిఖని: శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర కీలకమని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. 63వ హోంగార్డు రైజింగ్‌డే సందర్భంగా శనివారం కమిషనరేట్‌లో పరేడ్ నిర్వహించారు. ట్రాఫిక్, క్రైం నివారణ, కమ్యూనిటీ పోలీసింగ్, విపత్తు నిర్వహణ వంటి అంశాల్లో హోంగార్డులు చూపే అంకితభావం, ప్రతి భ ప్రశంసనీయన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్, ఏఆర్ ఏసీపీలు నాగేంద్రగౌడ్, ప్రతాప్, స్పెషల్ బ్రాంచ్ సీఐ భీమేశ్, ఆర్‌ఐలు దామోదర్, శ్రీనివాస్, శేఖర్, మల్లేశం, సంపత్ పాల్గొన్నారు.
ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
సుల్తానాబాద్‌రూరల్: ఎన్నికలకు పటిష్ట భద్రత ఏ ర్పాటు చేస్తున్నట్లు సీపీ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. దుబ్బపల్లి వద్ద రాజీవ్ రహదారిపై ఏర్పాటు చేసిన చెక్ పోస్టును సీపీ తనిఖీ చేశారు. సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై చంద్రకుమార్ తదితరులు ఉన్నారు.
ప్రశాంతంగా ఎన్నికలు
పెద్దపల్లిరూరల్: పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని, అసాంఘిక శక్తులు, రౌడీషీటర్లపై నిఘా ఉంచాలని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా.. ఎస్సై మల్లేశ్, సిబ్బందికి సూచించారు. రూరల్ పోలీస్‌స్టేషన్‌ను సీపీ సందర్శించారు. పలు సూచనలిచ్చారు.


