అన్నీ అసౌకర్యాలే..
ఇరుకు గదులతో ఇబ్బందులు ఒకటికి, రెంటికి తప్పని తిప్పలు సందర్శకులకే కాదు.. అధికారులకూ బాధలే ఎంపీడీవో కార్యాలయం దుస్థితి ఇది..
పెద్దపల్లిరూరల్: సుమారు ఐదు దశాబ్దాల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక సేవలు అందించిన పెద్దపల్లి ఎంపీడీవో కార్యాలయ భవనాన్ని ఆర్టీసీ బస్‌డిపోకు కేటాయించారు. కార్యకలాపాలను దాదాపు ఏడాదిగా అద్దెభవనంలో అరకొర వసతుల మధ్య కొనసాగిస్తున్నారు. పెద్దపల్లి బస్‌స్టేషన్ నుంచి రైల్వేస్టేషన్ వెళ్లే రోడ్డులోని ఓ భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. ఇరుకైన గదుల్లో సిబ్బంది అతికష్టంపై పనులు నెట్టుకొస్తున్నారు.
సమావేశాలు ఉంటే రైతువేదికలకే..
పంచాయతీ కార్యదర్శులు, ఇతర సమావేశాల నిర్వహణకు రాఘవాపూర్ లేదా బ్రాహ్మణపల్లిలోని రైతువేదికలను ఆశ్రయించాల్సిందే. ఉన్నతాధికారుల సూచనల మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శులతో డీపీవో, డీఎల్‌పీవో, ఎంపీడీవో తదితర అధికారులు తరచూ సమావేశాలు నిర్వహిస్తూనే ఉంటారు. సమావేశాల కోసం ఆయా గ్రామాలకు వెళ్లిరావడం కష్టంగా మారిందని అధికారులు, సి బ్బంది, సందర్శకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒంటికి, రెంటికీ తిప్పలే...
పనుల నిమిత్తం వెళ్లే సందర్శకులే కాదు.. కార్యాలయంలో పనిచేసే అధికారులు, సిబ్బందికి సైతం మల, మూత్ర విసర్జనకు ఇబ్బందులు పడాల్సిన ప రిస్థితులున్నాయి. వ్యాపార అవసరాల కోసం నిర్మించిన భవనంలో ప్రభుత్వ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో అవస్థలు మరీ ఎక్కువగా ఉన్నాయని పలువురు వాపోతున్నారు.
కొత్తగా సర్పంచులు వస్తే ఇంకా తిప్పలే..
ఈనెల 17వ తేదీ వరకు పంచాయతీ ఎన్నికలు మూడుదశల్లో నిర్వహిస్తారు. కొత్తగా ఎన్నికయ్యే స ర్పంచులు, ఆ తర్వాత ఎంపీటీసీ సభ్యులకై తే ఆఫీ సులో అడుగు పెట్టేందుకు కూడా అవకాశం ఉండ దు. ఇక మండల పరిషత్ జనరల్ బాడీ సమావేశా లు నిర్వహించుకోవాలంటే పల్లెల్లోని రైతువేదికల వద్దకు పరుగెత్తాల్సిన పరిస్థితులే కనిపిస్తున్నాయి.
పనులు సాగుతున్నాయి
అన్నీ అసౌకర్యాలే..


