కారుణ్య నియామకాల రద్దుకు కుట్ర
గోదావరిఖని: బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక వ్యయప్రయాసలకోర్చి సాధించిన సింగరేణి కారుణ్య ని యామకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభు త్వం కుట్ర చేస్తోందని మాజీమంత్రి, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. సింగరేణి మెడికల్ బోర్డు వైఖరిని నిరసిస్తూ స్థానిక ఆర్జీ–1 జీఎం కార్యాలయం ఎదుట శనివారం ఒక రోజు నిరసన దీక్ష చేట్టారు. ఈశ్వర్ మాట్లాడుతూ, 9నెలల నుంచి మెడికల్ బోర్డు పెట్టలేదని, మొక్కుబడిగా రెండు నిర్వహించినా.. బోర్డు ఉన్నదని చూపించుకోడానికే పరిమితమైందన్నారు. గుండె, పక్షవాతం, మూత్రపిండం తదితర దీర్ఘకాలిక వ్యా ధులతో బాధపడుతూ 15నెలలకు పైగా అన్‌ఫిట్‌లో ఉన్న కార్మికులను గత నవంబర్‌లో బోర్డుకు పిలిచిన సింగరేణి యాజమాన్యం.. 23 మందినే అన్‌ఫిట్ చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు. మెడికల్‌బోర్డును వెంటనే పునరుద్ధరించాలని ఆ యన డిమాండ్‌చేశారు. మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, పుట్ట మధూకర్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, నాయకులు వ్యాళ్ల హరీశ్‌రెడ్డి, కౌశిక హరి, సురేందర్‌రెడ్డి, కాపు కృష్ణ, మాదాసు రామమూర్తి, నూనె కొమురయ్య, పర్లపెల్లి రవి, వడ్డెపల్లి శంకర్, నాగెల్లి సాంబయ్య, బడికెల సంపత్, మేడిపల్లి సంపత్, బండి రమేశ్, ఐలి శ్రీనివాస్, నాగెల్లి సాంబయ్య, చెల్పూరి సతీశ్, సంపత్‌రెడ్డి, జాహిద్ పాషా తదితరులు పాల్గొన్నారు.


