కోర్టు స్థలం పరిశీలన | - | Sakshi
Sakshi News home page

కోర్టు స్థలం పరిశీలన

Dec 7 2025 7:18 AM | Updated on Dec 7 2025 7:18 AM

కోర్ట

కోర్టు స్థలం పరిశీలన

పెద్దపల్లిరూరల్‌: జిల్లా కోర్టు భవన సముదా యం నిర్మాణం కోసం రాఘవాపూర్‌లో కేటాయించిన పదెకరాలను జిల్లా పోర్ట్‌ఫోలియో జ డ్జి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లక్ష్మీనారాయణ అలిశెట్టి శనివారం పరిశీలించారు. భవన నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా రాఘవాపూర్‌లో నిర్మించొద్దని, పెద్దపల్లి పట్టణంలోనే స్థలం కేటాయించాలని పెద్దపల్లి బార్‌ అసోసియేషన్‌లోని కొందరు సభ్యులు హైకోర్టు జడ్జిల దృష్టికి గతంలో తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో స్థల పరిశీలన కోసం వచ్చిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లక్ష్మీనారాయ ణ.. అక్కడ సమాధులు ఉన్నాయా?అని ఆరా తీశారు. సర్వే నంబరు 1072లో కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల, ఆర్డీవో గంగయ్య, డీసీపీ భూక్యా రాంరెడ్డి, ఏజీపీ ఉప్పు రాజు, ఏసీపీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అందరూ ఓటెయ్యాలి

మంథనిరూరల్‌: స్థానిక ఎన్నికల్లో ఓటర్లు అందరూ స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకో వాలని, ఇందుకోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ఏసీపీ రమేశ్‌ తెలిపారు. అడవి సో మన్‌పల్లి, పోతారం, విలోచవరం, పుట్టపాక పోలింగ్‌ కేంద్రాలను ఆయన శనివారం సందర్శించారు. ఎన్నికల కోడ్‌పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ప్రజలు సహకరించాలని కోరారు. సీఐ రాజు, ఎస్సైలు రమేశ్‌, సాగర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

గొప్ప సంస్కర్త అంబేడ్కర్‌

జ్యోతినగర్‌(రామగుండం): భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ గొప్ప సంస్కర్త, అని కుల వివక్షను రూపుమాపేందుకు తన జీవితం అంకితం చేశారని ఎన్టీపీసీ రామగుండం – తెలంగాణ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చందన్‌ కుమార్‌ సామంత అన్నారు. అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా ఎన్టీపీసీ వికాస కేంద్రంలో శనివారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈడీ మాట్లాడుతూ, ఆలోచనాపరుడు, సమానత్వం కోసం వాదించడంలో నేర్పరని అన్నారు. జనరల్‌ మేనేజర్లు ముకుల్‌ రాయ్‌, అవిజిత్‌ దత్తా, మానవ వనరుల విభాగాధిపతి బిజోయ్‌ కుమార్‌ సిక్దార్‌ తదితరులు పాల్గొన్నారు.

రైల్వేస్టేషన్‌లో తనిఖీలు

రామగుండం: రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, ప్రభుత్వ రైల్వే, సివిల్‌ పోలీసులు స్థానిక రైల్వేస్టేషన్‌లో శనివారం తనిఖీలు చేశారు. ప్రయాణికుల వివరాలు సేకరించారు. వస్తుసామగ్రి తనిఖీ చేశా రు. ప్రధానంగా బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించే రైళ్ల జనరల్‌ బోగీలను జాగిలంతో శోధించారు. అనుమానితుల ను ప్రశ్నించి వదిలేశారు. ఆర్‌పీఎఫ్‌ సీఐ రాజేంద్రప్రసాద్‌, ఏఎస్సై నాగరాజు, రామగుండం సివిల్‌ ఎస్సై సంధ్యారాణి, జీఆర్పీ ఇన్‌చార్జి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనుల పరిశీలన

గోదావరిఖని: గోదావరి తీరంలోని సమ్మక్క – సారలమ్మ గద్దెల అభివృద్ధి పనులను రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌ శనివారం పరిశీలించారు. పనుల పురోగతి పరిశీలించి, నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట ఆలయ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు బొంతల రాజేశ్‌, మారెల్లి రాజిరెడ్డి, గుండేటి రాజేశ్‌, కాంట్రాక్లర్లు తదితరులు ఉన్నారు.

కోర్టు స్థలం పరిశీలన 1
1/4

కోర్టు స్థలం పరిశీలన

కోర్టు స్థలం పరిశీలన 2
2/4

కోర్టు స్థలం పరిశీలన

కోర్టు స్థలం పరిశీలన 3
3/4

కోర్టు స్థలం పరిశీలన

కోర్టు స్థలం పరిశీలన 4
4/4

కోర్టు స్థలం పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement