21న లోక్ అదాలత్
గోదావరిఖనిటౌన్: ఈనెల 13న నిర్వహించాల్సిన జాతీ య లోక్ అదాలత్‌ను ఈనెల 21న నిర్వహిస్తున్నామని గో దావరిఖని అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాసరా వు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కక్షిదారులు ఈనెల 21న ని ర్వహించే లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని న్యాయమూర్తి కోరారు.
విద్యార్థినికి అభినందన
జూలపల్లి(పెద్దపల్లి): ఎన్టీపీసీలో జరిగిన జిల్లాస్థాయి వైజ్ఞానిక సదస్సులో ప్రతిభచూపి రాష్ట్రస్థాయికి ఎంపికైన జూపిటర్ విద్యాలయం బా లిక సమన్వితను జిల్లా విద్యాధికారి శారద శుక్రవారం అభినందించి జ్ఞాపిక అందజేశారు. గ్రీన్‌ఎనర్జీ అంశంలో ప్రాజెక్టు ప్రదర్శించింది. కరస్పాండెంట్ ఆందె కుమారస్వామి, ఉపా ధ్యాయులు, విద్యార్థినిని అభినందించారు.
81 మందికి ఉద్యోగాలు
పెద్దపల్లి: కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించి న జాబ్‌మేళాలలో 81మందికి ఉద్యోగాలు ల భించాయి జిల్లా ఉపాధి కల్పనాధికారి రాజశేఖ ర్ తెలిపారు. స్థానిక టాస్క్ సెంటర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో మెగాజా బ్‌మేళా నిర్వహించా రు. 16 ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు హాజరు కాగా, 931 మంది నిరుద్యోగులు ఇంటర్వ్యూ కు వచ్చారన్నారు. నైపుణ్యం, విద్యార్హతల ఆధారంగా ఎంపిక చేశారని వివరించారు. ఎంపికై న వారికి కలెక్టరేట్ పరిపాలన అధికారి ప్రకాశ్ నియామక పత్రాలు అందజేశారు. టాస్క్ సెంటర్ ఇన్‌చార్జికౌసల్య, అధికారులు పాల్గొన్నారు.
నిబంధనలు పాటించాలి
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): ఎన్నికల నిబంధనలు అదరూ పాటించాలని పెద్దపల్లి డీ సీపీ రాంరెడ్డి సూచించారు. సుందిళ్ల, సింగిరెడ్డిపల్లి, ముస్త్యాల, పెద్దంపేట, జల్లారం గ్రామా ల్లో శుక్రవారం నిర్వహించిన సదస్సులో గో దావరిఖని ఏసీపీ రమేశ్‌తో కలిసి ఆయన మా ట్లాడారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు అందరూ సహకరించాలని కోరారు. టూటౌన్ సీఐ ప్రసాద్‌రావు, ఏఎస్సై లు తిరుపతిరెడ్డి, కృష్ణ, సిబ్బంది కనుకయ్య, క ల్యాణ్, విశ్వనాథ్, అఫ్రోజ్, కిరణ్ ఉన్నారు.
విదేశీ విద్యపై అవగాహన
పెద్దపల్లి: విదేశాల్లో ఉన్నత విద్య, స్కాలర్‌షిప్ ల కోసం అవగాహన కల్పిస్తున్నామని స్టడీ స ర్కిల్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. డిగ్రీ పూర్తి చేసి, ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 21వ తేదీవరకు టీజీ బీసీ స్టడీ సర్కిల్ వెబ్‌సైట్ www. tg bcstudycircle. cgg.gov.inద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాల కోసం 040– 24071178, 0878– 22686 86 నంబర్లలో ఆఫీసు వేళల్లో సంప్రదించాలని కోరారు.
హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థి
రామగిరి(మంథని): పెద్దంపేట సర్పంచ్ స్థా నానికి నామినేషన్ దాఖలు చేసిన చింతపట్ల సుహాసిని హైకోర్టును ఆశ్రయించారు. ఓటరు లిస్ట్‌లో ఆమె పేరు లేదని అధికారులు తిరస్క రించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓటుహక్కు వినియోగించుకున్నానని, అయినా, జా బితాలో తనపేరు లేదనడం సరికాదని, ఎన్నికలు వాయిదా వేయాలని అభ్యర్థించారు. ఆ ర్వో సత్యనారాయణను సంప్రదించగా.. సుహా సిని నామినేషన్ పరిశీలించాక ఓటరు జాబితాలో తనిఖీ చేయగా.. ఆమె పేరు లేదని, అందుకే తిరస్కరించామన్నారు. కాగా, సుహాసిని నామినేషన్ పత్రాలను అనుమతించాలని హై కోర్టు నుంచి తనకు ఎలాంటి ఆదేశాలు రాలే దని కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు.
పట్టాల మధ్య నిలిచిన కారు
పెద్దపల్లి: కూనారం – పెద్దపల్లి మధ్యగల రైల్వేలెవల్ క్రాసింగ్ గేట్ మధ్య శుక్రవారం సాయంత్రం ఓ కారు పట్టాలపైనే నిలిచిపోయింది. రై లు వస్తుందనే సమాచారంతో గేట్‌మ్యాన్ గేట్ వేస్తుండగా.. రాంపల్లి వైపు నుంచి పెద్దపల్లి వైపు వస్తున్న ఓ వ్యక్తి తన కారును వేగంగా పట్టాలపైకి తీసుకొచ్చాడు. ఈలోగా రెండోగేట్ పడిపోవడంతో కారు పట్టాలపైనే నిలిచిపోయింది. అప్పటికే రైలు కూత వినిపించడంతో వాహనదారు కారు అక్కడే వదిలేసి పారిపోయాడు. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది గేటును తెరవడానికి విఫలయత్నం చేశారు. ఆ వెంటనే రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో రెండు వైపులా రైళ్లను గంటకుపైగా నిలిపివేశారు. అనంతరం రైల్వేగేటు తెరిచి కారును బయటకు తీసుకెళ్లారు. ఆ తర్వాత రైళ్ల రాకపోకల్ని అధికారులు పునరుద్ధరించారు.
21న లోక్ అదాలత్
21న లోక్ అదాలత్


