శాంతియుతంగా స్థానిక ఎన్నికలు
పెద్దపల్లి: నిబంధనల ప్రకారం పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై రి టర్నింగ్ అధికారులతో కలెక్టరేట్‌లో శుక్రవారం ని ర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈనెల 6న పీవోలు, ఏపీవోలకు ఎన్నికల విధులపై శిక్షణ ఇస్తామన్నారు. తొలివిడతలో 4 సర్పంచ్, 210 వార్డులు ఏకగ్రీవమయ్యాయని, 95 పంచాయతీలు, 670 వా ర్డులకు ఈనెల 11న పోలింగ్ జరుగుతుందని వి వరించారు. తొలివిడత ఎన్నికల సిబ్బంది ఈనెల 6న పోస్టల్ బ్యాలెట్‌లో ఓటుహక్కు వినియోగించు కోవాలని కోరారు. ఎంఈవోలు, కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్లు ప్రతీనెల స్కూళ్లను తనిఖీ చేయాలని సూచించారు. జెడ్పీ సీఈవో నరేందర్ పాల్గొన్నారు.
కలెక్టర్ ఆకస్మిక పర్యటన..
మంథని/కమాన్‌పూర్/రామగిరి/ముత్తారం/కాల్వశ్రీరాంపూర్: కమాన్‌పూర్, రామగిరి, మంథని, ము త్తారం, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాలను కలెక్టర్ శ్రీహర్ష ఆకస్మికంగా తని ఖీ చేశారు. బ్యాలెట్ పత్రాల ముద్రణ, పంపిణీ ని బంధనల ప్రకారం చేట్టాలన్నారు. తర్వాత శ్రీపాద మార్గ్ ఫోలేన్ రోడ్డు విస్తరణ పనులు పరిశీలించారు.


