● ఆరు వారాలపాటు అవగాహన ● రంగంలోకి దిగిన సైబర్ సెక్యూరి
గోదావరిఖని: సైబర్ నేరాలపై పోలీసుశాఖ డేగకన్ను వేసింది. రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ఆరువారాల పాటు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించింది.
సామాన్యుల నుంచి రిటైర్డ్ ఉద్యోగుల వరకు అందరూ బాధితులే..
సామాన్యుల నుంచి ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, రిటైర్డ్ ఉద్యోగుల వరకూ సైబర్‌నేరగాళ్ల ఉచ్చులోపడి రూ.కోట్లు కోల్పోతున్నారు. మొబైల్ ఫోన్ల ఆధారంగా లావాదేవీలు, బ్యాంక్ ఖాతాలు, సోషల్ మీడియా అకౌంట్లు నిత్యం వారిబారినడుతున్నాయి. అయితే, ప్రజల్లో అవగాహన పెంచడం, నేరాల్ని అరికట్టడం కోసం ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యమని పోలీస్ శాఖ భావిస్తోంది. ఈక్రమంలో స్కూళ్లు, కాలేజీల్లో సైబర్ సేఫ్టీ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది. బ్యాంకులు, ఏటీఎంల వద్ద అవగాహన పోస్టర్లు అంటించనుంది. సోషల్ మీడియా ద్వారా హెచ్చరిక చేయాలని నిర్ణయించింది. ఫిషింగ్, ఓటీపీ మోసాలు, ఫేక్‌లింక్‌ల గురించి వివరించనుంది. తరచూ చేసే చిన్నతప్పిదాలతో పెద్దనష్టాలకు దారితీసే నేపథ్యంలో అజ్ఞానం – అతిపెద్ద ప్రమాదం నినాదంతో ఇంటింటా సైబర్ భద్రతను తీసుకెళ్లనుంది.
ఆధునిక సాంకేతికత..
సైబర్‌నేరాలను ఎదుర్కొనేందుకు పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు. డిజిటల్ ట్రాకింగ్, ఫోన్, సోషల్ మీడియా విశ్లేషణ, నేరతీవ్రత, డీప్ మానిటరింగ్, ప్రత్యేక సైబర్ ఇంటలిజెన్స్ టీంలను ఏర్పాటు చేస్తోంది. ఇలాంటి పద్ధతుల్లో సైబర్‌నేరస్తులను పట్టుకునేలా వ్యవస్థను బలోపేతం చేస్తోంది. సైబర్‌మోసం జరిగినా వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు అందించాలని సూచిస్తోంది.
భద్రత కూడా
అత్యాధునిక టెక్నాలజీ చేతిలో ఉన్నా.. భద్రత కూ డా అవసరమని పోలీసులు చెబుతున్నారు. జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలంటున్నారు. మారుతున్న సైబర్ నేరాల తీరుకు అనుగుణంగా ప్రజలూ మారాలని, జాగ్రత్తలు తీసుకుంటూ అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండాలంటున్నారు.


