‘గుర్తు’ంచుకో..
పోటాపోటీగా నామినేషన్లు తొలివిడతలో 95 సర్పంచ్ స్థానాలకు 376మంది పోటీ ముగిసిన మూడోవిడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ అప్పుడే ప్రచార రంగంలోకి దూసుకెళ్తున్న అభ్యర్థులు
సాక్షి పెద్దపల్లి: ‘గుర్తు.. గుర్తుంచుకో.. అమ్మా.. గుర్తువొచ్చింది.. మా గుర్తు గుర్తుంచుకో’ అని పల్లెల్లో అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది. జిల్లాలో మూడు విడతల్లో జరిగే పంచా యతీ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టమైన నా మినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. ఇప్పటి కే తొలివిడత నామినేషన్ల ఉపసంహరణ ప్ర క్రియ కూడా ముగియడంతో అభ్యర్థులకు గు ర్తులు కేటాయించారు. రెండోవిడత నామినే షన్లు ఉపసంహరణ గడువు శనివారం ముగియనుంది. మూడు విడతల్లో నిర్వహించే పంచాయతీ ఎన్నికలకు శుక్రవారంతో నామినేషన్ల స్వీకర ణ ప్రక్రియ పూర్తయింది. ఆఖరురోజైన శుక్రవా రం సర్పంచ్ అభ్యర్థులు భారీగా తమ నామినేషన్లు దాఖలు చేశారు. గుర్తులు కేటాయించిన అభ్యర్థులు ఇప్పటికే ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. ‘గుర్తు.. గుర్తు ఉంచుకో’ అంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తమకు వచ్చిన సింబల్ (బ్యాట్, ఉంగరం తదదితర) పెద్దఎత్తున కొనుగోలు చేసి ఇంటింటికీ పంచిపెడుతున్నారు. తమ గుర్తు మరిచిపోవద్దు అంటూ ఓటర్లను అభ్యర్థులు వేడుకుంటున్నారు.
తొలివిడత బరిలో 376మంది
జిల్లాలోని మంథని, కమాన్‌పూర్, రామగిరి, కా ల్వశ్రీరాంపూర్, ముత్తారం మండలాల్లో తొలివిడత ఎన్నికలు జరుగుతాయి. ఇందులోని 99 స ర్పంచ్ స్థానాలకు నామినేషన్లు స్వీకరించగా.. 4 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మిగిలిన 95 స్థానాల కోసం 376 మంది పోటీపడుతున్నారు. అలాగే 896 వార్డు స్థానాల్లో 211 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 685 వార్డులకు 1,880 మంది పోటీలో ఉన్నారు. మంథని మండలంలోని మైదంపల్లి, తోటగోపయ్యపల్లి, నా గారం పంచాయతీలతోపాటు, రామగిరి మండలంలోని చందనాపూర్ గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైన వాటిలో ఉన్నాయి.
రెండో విడతలో..
రెండోవిడతలో అంతర్గాం, ధర్మారం, జూలప ల్లి, పాలకుర్తి మండలాల్లోని 73 సర్పంచ్ స్థానాలకు 377మంది, 684 వార్డు స్థానాలకు 1,641 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశా రు. శనివారం మధ్యాహ్నం 3 గంటల వరకు నా మినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. త దు పరి అభ్యర్థుల తుదిజాబితా ప్రకటించి పోటీ లో ఉన్నవారికి గుర్తులు కేటాయించనున్నారు.
ముగిసిన మూడోవిడత నామినేషన్లు..
మూడోవిడతలో ఎలిగేడు, ఓదెల, పెద్దపల్లి, సు ల్తానాబాద్ మండలాల్లోని 91 పంచాయతీలకు 458 నామినేషన్లు, 852 వార్డుస్థానాలకు 1,234 నామినేషన్లు స్వీకరించారు. మంగళవారం మ ధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్లు విత్‌డ్రా చేసుకునేందుకు గడువు ఉంది. అదేరోజు పో టీలో మిగిలిన అభ్యర్థుల జాబితా అధికారులు ప్రకటించి గుర్తులు కేటాయిస్తారు.
సైబర్‌నేరాలపై డేగకన్ను
‘గుర్తు’ంచుకో..


