కొత్తవారికే లక్కు | - | Sakshi
Sakshi News home page

కొత్తవారికే లక్కు

Oct 28 2025 7:40 AM | Updated on Oct 28 2025 8:10 AM

కొందరు పాతవ్యాపారులకూ ‘కిక్కు’ అయినా, సిండికేట్‌ చేతుల్లోకే వైన్స్‌షాప్‌లు వెళ్లే అవకాశం! అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ సమక్షంలో డ్రా ప్రక్రియ డిసెంబర్‌ ఒకటో తేదీ నుంచి కొత్త మద్యం పాలసీ అమలు

సాక్షి, పెద్దపల్లి: ఎవరి ముఖంలో చూసినా టెన్షన్‌.. లక్కీడ్రాలో తమపేరు వస్తుందా? రాదా? అనే ఆందోళనే కనిపించింది. అసలే ఒక్కో వైన్స్‌షాపు కోసం పదుల సంఖ్యలో దరఖాస్తు చేశారు. అందుకే ఏమవుతుందో? ఏమో? అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. రెండేళ్లకాల వ్యవధి కోసం వైన్స్‌షాపుల నిర్వహణ బాధ్యతలు లభించినవారు ‘పుల్లు’ జోష్‌తో ఉప్పొంగారు. అదృష్టం వరించని వారు దేవు‘డ్రా’! అనుకుంటూ నిట్టూర్చారు. ఇది పెద్దపల్లి శివారులోని స్వరూప గార్డెన్స్‌ ఆవరణలో సోమవా రం కనిపించిన ఉత్కంఠ భరితమైన దృశ్యం.

అదృష్టం పరీక్షించుకునేందుకు..

ఎలాగైనా మద్యం దుకాణం సొంతం చేసుకోవాల న్న ఉద్దేశంతో పదుల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నవారు కొందరైతే.. అదృష్టాన్ని పరీక్షించుకుందామని పోటీపడ్డారు మరికొందరు. దీంతో ఒక్కో వైన్స్‌షాప్‌నకు సగటున 20 మంది పోటీపడ్డారు. ఈక్రమంలో ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ మహిపాల్‌రెడ్డి అధ్యక్షతన మద్యం దుకాణాల కేటాయింపు కోసం సోమవారం డ్రా నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ హాజరై డ్రాలో ఎంపికై న వారిపేర్లు ప్రకటించారు. ఒక్కో పేరు పిలుస్తూనే డ్రాలో వెళ్లిన దుకాణం నంబరును దరఖాస్తుదారులకు చూపించారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియోలో చిత్రీకరించారు. దుకాణాలు దక్కించుకున్న వారు వార్షిక లైసెన్స్‌ ఫీజులో ఆరోవంతు చెల్లించి ప్రొవిజినల్‌ లై సెన్స్‌లు పొందారు. సుమారు 2,000 మంది వరకు దరఖాస్తుదారులు ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో గార్డెన్స్‌ ఆవరణ సందడిగా కనిపించింది. మొత్తంగా 74 దుకాణాల్లో గౌడ సామాజికి వర్గానికి 13, ఎస్సీలకు 8, మహిళలకు 16 మద్యం దుకాణాలు దక్కాయి.

వ్యాపారంతో సంబంధంలేనివారే..

మద్యం వ్యాపారంతో సంబంధం లేనికొత్త వ్యక్తులు ఈసారి తెరపైకి వచ్చారు. చాలాచోట్ల గ్రూపులుగా ఏర్పడి పదుల సంఖ్యలో దరఖాస్తు చేశారు. వీరికి ధీటుగా పాతవ్యాపారులు సైతం వందల సంఖ్య లో దరఖాస్తు చేసినా.. లాటరీలో వారికి సింగిల్‌ డిజిట్‌ దుకాణానికి మించి రాలేదు. అదృష్టం కలిసిరావాలని కొందరు తమ కుటుంబ సభ్యుల పేరిట దరఖాస్తు చేశారు. దీంతో 16మంది మహిళలను వైన్స్‌ షాపులు వరించాయి.

భారీ పోలీస్‌ బందోబస్తు

బందంపల్లిలోని స్వరూప గార్డెన్స్‌లో డ్రా సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీబందోబస్తు ఏర్పాటు చేశారు. దరఖాస్తుదారులు, వారి బంధువులు భారీగా రావడంతో వారి వాహనాలతో ఆ ప్రాంతం హడావుడిలా కనిపించింది. మరోవైపు.. లోనికి మొబైల్‌ఫోన్లను అనుమతించకపోవడంతో చాలామంది ఇబ్బందులకు గురయ్యారు.

పెద్దపల్లి: జిల్లాలోని మద్యం దుకాణాలను పూర్తిపారదర్శకంగా, డ్రా పద్ధతిన కేటాయించామని అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ తెలిపారు. పెద్దపల్లి సమీపంలోని బందంపల్లి స్వరూప గార్డెన్స్‌లో సోమవారం మద్యం దుకాణాల కేటాయింపు కోసం డ్రా నిర్వహించారు. అరుణశ్రీ మాట్లాడుతూ, జిల్లాలోని మొత్తం 74 మద్యం దుకాణాల కోసం 1,507 దరఖాస్తులు అందాయన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రిజర్వుచేసిన వాటితోపాటు జనరల్‌ కేటగిరీలోని వైన్స్‌షాప్‌లను లాటరీ పద్ధతిన కేటాయించామని ఆమె వివరించారు. ఈ మొత్తం ప్రక్రియను వీడియోలో చిత్రీకరించారని చెప్పారు. ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ మహిపాల్‌రెడ్డి, దరఖాస్తుదారులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

చక్రం తిప్పునున్న వ్యాపారులు

లిక్కర్‌ మాఫియాలో రాటుతేలిన వ్యాపారుల్లో కొందరికి దుకాణాల రాకపోవడం.. మద్యం వ్యాపారంతో సంబంధంలేని వారిని వైన్స్‌షాపులు వరించడంతో వ్యాపారులు ఒకింత నిరాశలో ఉన్నారు. పదుల సంఖ్యలో దరఖాస్తు చేసినా.. లాటరీ తగలనివారు.. దుకాణాలు దక్కిన వారికి గుడ్‌విల్‌ చెల్లించి షాప్స్‌ సొంతం చేసుకోవాలనే ప్రయత్నాలు ఇప్పటికే ఆరంభించారు. కొత్తగా వచ్చినవారి గురించి ఆరా తీస్తున్నారు. భారీగా గుడ్‌విల్‌ ఆఫర్‌ చేసి, వైన్స్‌షాపులు దక్కించుకునేందుకు యత్నిస్తున్నారు.

కొత్తవారికే లక్కు 1
1/1

కొత్తవారికే లక్కు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement